Sunday, November 10, 2024
spot_img

ఆగష్టు 01,02న ఢిల్లీలో దండోరా ధర్నా

Must Read
  • మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ

ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తో ఆగష్టు 01,02 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ.బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,గత పది సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ ఇదిగో అదిగో అంటూ దళితులను మభ్యపెడుతూ,కాలయాపన చేస్తున్నారని అన్నారు.

400 సీట్లు సొంతంగా సంపాదించడం కోసం భారతీయ జనతా పార్టీ కుట్రలకు తెరలేపిందని దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఓట్ల కోసం కొంతమంది నాయకులతో కుమ్మక్కై 2023లో సార్వత్రిక ఎన్నికల కోసం ర్యాలీలు నిర్వహించిందని విమర్శించారు. ఎస్సీ ఏ,బి,సి,డి వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం,పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని చేశారు.ఆగష్టు 01,02న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వర్గీకరణ సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.2023 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కి వచ్చిన ఫలితాలను గుర్తు చేసుకుని వర్గీకరణ చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో కేసును పరిష్కరించి ఆర్టికల్ 371(డి) ద్వారా ఎస్సీ ఎ,బి,సి,డి వర్గీకరణ చేపట్టాలని తెలిపారు.అనంతరం “ఛలో ఢిల్లీ” పోస్టర్,కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింత శ్యామ్ మాదిగ,అధికార ప్రతినిధి సగ్గి ప్రకాష్ మాదిగ,యువసేన అధ్యక్షులు గొల్లపల్లి నరేష్ మాదిగ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పెంజర్ల శ్యాం కుమార్,నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎస్ లక్ష్మయ్య,ప్రభాకర్, సాయి,తదితరులు పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS