Monday, November 25, 2024
spot_img

ప్రొఫెసర్ కోదండరాంకి లేఖ రాసిన దాసోజి శ్రవణ్

Must Read

కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేనోళ్ళు,కష్టకాలంలో పార్టీని అనేక  ఇబ్బందులకు గురిచేసినోళ్లు మంత్రులుగా చలామణి అవుతుంటే మీరెందుకు అధికారానికి దూరంగా ఉంటున్నారని ప్రొఫెసర్ కోదండరాం ను ప్రశ్నించారు డా.దాసోజి శ్రవణ్.బుధవారం డా.కోదండరాం కు బహిరంగ విజ్ఞప్తి చేస్తూ దాసోజి శ్రవణ్ లేఖ రాశారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా కోదండరాం పట్ల కృతజ్ఞత ఉంటె,కోదండరాంను రాజ్యసభకు సభ్యుడిగా లేదా ఎమ్మెల్సీ గా నియమించి ఉండేవారని తెలిపారు.కోర్టులో చివరి తీర్పు వచ్చే వరకు ఎమ్యెల్సీ పదవులు భర్తీ చేయమని న్యాయమూర్తి ముందు వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు ఆనాటి గవర్నర్ దానికి పూర్తి బిన్నంగా,కోర్టును అగౌరవపరుస్తూ సహజ న్యాయ సూత్రాలకు  విరుద్ధంగా కుట్ర కుతంత్ర పూరిత వైఖరితో 27-01-2024 నాడు కోదండరాంను మరియు మరో జర్నలిస్టు మిత్రుని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ  రేవంత్ రెడ్డి మంత్రివర్గం తీర్మానించిందని తెలిపారు.ఆ తీర్మానాన్ని గవర్నర్  ఆమోదం కోసం పంపితే తమ నియామక ప్రతిపాదనలను రెండు నెలల పాటు తన వద్ద పెండింగులో పెట్టుకుని రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదం వేసి,అధికారిక గజెట్ కూడా వెలువరించారని గుర్తుచేశారు.మాకు న్యాయం కలుగకుండా రేవంత్ రెడ్డి చేసిన కుట్రలో కోదండరాం కూడా భాగం కావడం తనను బాధించిందని విమర్శించారు.ఆధిపత్య కులాల పెట్టుపడి వ్యాపారంగా మారిన వికృత రాజకీయ పోటీలో, ఓ పక్క నెగ్గలేక,మరో పక్క ఓటమిని అంగీకరించలేక ఇంకా ప్రజా ప్రస్థానం లోనే నిలబడి ఉన్నానని తెలిపారు.ఏ పార్టీలో ఉన్న ప్రజల పక్షాన నిలబడ్డానని వెల్లడించారు.అయితే, తన హక్కులని తానే కాపాడుకోలేక పోతే,ప్రజల హక్కులను యెట్లా కాపాడుతాను అనే బలమైన ఆలోచనతో ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నాని వెల్లడించారు.

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS