ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.తన అరెస్ట్,రిమాండ్ పై జూన్ లో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.గతలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
మార్చ్ 21న ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం అయిన తీహార్ జైలులో ఉన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.