ఆదివారం ప్రధాని మోడీ పాటు ప్రమాణస్వీకారం చేసిన కేంద్రమంత్రులకు శాఖలు కేటాయించారు.అమిత్ షాకి కేంద్ర హోంశాఖ,నితిన్ గడ్కరీకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు శాఖ,జయశంకర్ కి విదేశాంగ శాఖ, మనోహర్ లాల్ కట్టర్ కి హోసింగ్ అండ్ అర్బన్ శాఖ,నిర్మల సీతారామన్ కి ఆర్థిక శాఖ,చిరాగ్ పాశ్యన్ కి యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ,శివరాజ్ సింగ్ కి వ్యవసాయం మరియు రైతు సంక్షేమం శాఖ, హర్దీప్ సింగ్ కి పెట్రోలియం శాఖ, అశ్వినికి రైల్వే,సమాచార శాఖ, పీయూష్ గోయల్ కి వాణిజ్య శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ కి విద్యాశాఖ,రామ్మోహన్ నాయుడుకి పౌరవిమాన శాఖ, అన్నపూర్ణ దేవికి మహిళా మరియు శిశువు అభివృద్ధి శాఖ,సీఆర్ పటేల్ కి జలశక్తి శాఖ,శర్భానంద సోనోవాల్ కి ఫిషింగ్ శాఖ,భూపేంద్ర యాదవ్ కి పర్యావరణం శాఖలు కేటాయించారు.
తెలంగాణ నుండి ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు దక్కాయి.కిషన్ రెడ్డి,బండిసంజయ్ నిన్న కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కిషన్ రెడ్డికి బొగ్గు,గనుల శాఖ కేటాయించగా , బండిసంజయ్ కి హోం శాఖ సహాయ మంత్రి పదవిని అప్పగించారు.