- దేవాదాయ నిర్లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
- హక్కుల కోసం పోరాడుతున్న ఫౌండర్ ట్రస్టీలు – అనుమతించని దేవాదాయ శాఖ
- వివరణ ఇవ్వాలి అని కోరుతున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి (ఓబీసీ మోర్చ) శరద్ సింగ్ ఠాకూర్
మహాశివరాత్రి సందర్భంగా రాజకరణ్ గంగాప్రసాద్ ధర్మశాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర శివాలయం లో ఆలయాన్ని శుభ్రం చేయకపోవడం చాలా బాధాకరం. ఎండోమెంట్స్ విభాగం ఆలయానికి కనీసం తాత్కాలిక లైటింగ్ లేదా పువ్వులు, రంగులు కూడా వేయలేదు. కానీ, ప్రతి నెలా ఎండోమెంట్ విభాగం గుడి ఆస్తి కింద అద్దెలు వసూలు మాత్రం తూ చా తప్పకుండా వసూలు చేస్తోంది. ఈ ఆలయానికి ఒక ఎండోమెంట్ అధికారి, ముగ్గురు ఆఫీస్ అసిస్టెంట్స్ మరియు ఒక పూజారి ఉన్నారు. ఈ ఆలయ ఆస్తుల పరిరక్షణ, ఆలయ అభివృద్ధిని అటకెక్కించిన దేవాదాయశాఖ, వారి ఉద్యోగులకు మాత్రం జేబు నిండా జీతాలు ఇస్తుంది అని ఇక్కడి స్థానిక భక్తులు వాపోతున్నారు. ఈ ఆలయానికి మెట్రో నుండి 10 కోట్లు వచ్చాయి అని ఒక ప్రచారం ఉన్నది. మరి అది నిజమా, ఒక వేళ నిజమైతే ఆ డబ్బును ఆలయ అభివృద్ధికి ఎలా ఉపయోగిస్తున్నారు అని విషయం ప్రజలకు దేవాదాయశాఖ వారు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో మంది భక్తులు తమ వంతు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడ దేవాదాయ శాఖ బాధ్యతారహితంగా ఉండడం వల్ల ముందుకు రాలేకపోతున్నారు. తక్షణమే, ఇక్కడి అధికారులు స్వామి వారికి శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటో వివరించాలి. ఆలయానికి సంబంధించి తమ తదుపరి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో జనాలకు తెలియజెప్పాలి.