- కేటీఆర్, హరీశ్ లకు రేవంత్ సర్కార్ ను విమర్శించే హక్కులేదు
- తెలంగాణ కేసీఆర్ ఏటీఎం అన్న మోదీ వ్యాఖ్యలు ఏమైనయ్
- నేడు ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు
- 8లక్షల కోట్ల అప్పుజేసి ఆగంచేసి సిగ్గులేకుండా మాట్లాడతారా
- బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు
- ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శలా
- బీఆర్ఎస్ పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ విమర్శలు
పొద్దున లేచినప్పటి నుండి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి, రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన విషయాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్స్ ముఖ్యంగా బావబామ్మర్దులు చెలరేగి పోతున్నారు. బీఆర్ఎస్ లీడర్లను, వీరి అవినీతి, భూకుంభ కోణాలను బట్టబయలు చేసి అవినీతికి పాల్పడిన వారందరిని ఫిక్స్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కోరుచున్నాను. కుక్కతోక వంకర అన్నట్లు బీఆర్ఎస్ వాళ్ళకు, ఒక్క రోజు కూడా సమయమివ్వకుండ చర్యలు తీసుకోవాలని కోరారు. 10 సంవత్సరాల గత బీఆర్ఎస్ కుటుంబ పాలనలో జరిగిన లక్షల కోట్ల అవినీతితో సహా ల్యాండ్, శ్యాండ్, గ్రానైట్, డ్రగ్స్, లిక్కర్ మాఫియా లాంటి అనేక కుంభకోణాలు జరిగాయని, తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని స్వయంగా ప్రధానమంత్రి ఎన్నోసార్లు అఫిషియల్ గా ప్రకటించి.. కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నదని చెప్పి ఇంతవరకు ఆయన మీద ఎలాంటి చర్యలేందుకు తీస్కో లేదు? అంటే ఉచ్చింక రెడీ కాలేదా, దయచేసి పీఎం గారు చెప్పాలి? అదేవిధంగా వూల్టా చోర్ కొత్వాల్కో డాంటా దొంగే దొంగ దొంగా అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలోని వేల ఎకరాల భూములను క్విడ్ ప్రో క్రింద కాజేసి లక్షల కోట్లు అక్రమంగా సంపాదించుకొని కేసీఆర్ కుటుంబీకులు & గులాబీ నాయకులు, తెలంగాణాను ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి, ఆర్థిక వనరులు లేకుండాచేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ప్రశ్నించారు.
జబ్ గీదడ్కి మౌత్ పూకారేతో సేహార్కితరఫ్ భాగ్తాహై, రాబందుకు పోయ్యే కాలం దాపురించినపుడు పట్నం దిక్కు రిగెత్తినట్లుంది. టీఆర్ఎస్/బీఆర్ఎస్ లీడర్ల వ్యవహారం ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల ద్వయం బావ హరీష్ & కేటీఆర్ ఇద్దరు కల్లు తాగిన కోతూల్లగా, తేలు కుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపై లేస్తున్నారు అంటే మా అబ్బ సొత్తు, మా హక్కు మా రాజ్యాన్ని ఆయాచితంగా రేవంతరెడ్డి దోచుక పోయినట్లు బలుపుతో ఇస్టారీతిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దూసిస్తున్నారు. వీళ్లకు తెలంగాణ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినను, పార్లమెంట్ ఎన్నికల్లో గాడిద గుడ్డు ఇచ్చిన సిగ్గులేకుండ నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఒకదిక్కు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ క్యాబినెట్ మంత్రి హోదాలో ప్రజల సొమ్ము/స్టేట్ ఎక్స్ చెక్కర్ తో సకల సౌకర్యాలు పొందుతూ, వరదలతో అనేక విధాల నష్టపొయ్యి ప్రజలు ప్రాణాలు పొగొట్టుకున్నా కనీసం సానుభూతి కూడా తెలుపకుండ ఫాంహౌస్ లో నిస్సిగ్గుగా నోరుమూసుకున్న కేసీఆర్ పై కేటీఆర్, ఆరడుగుల బుల్లెట్ ఎందుకు మాట్లాడం లేదో చెప్పాలి.
2014కు ముందు రబ్బరు చెప్పులు, ట్రంక్ పెట్టేలతో వచ్చిన వీళ్లకు ఇప్పుడు సంపాదించిన లక్షల కోట్ల డబ్బు, భూములు, ఆస్తులు, ఫాంహౌస్ లు ఎలా వచ్చాయి. ఇది తెలంగాణ ప్రజలను దోచుకున్న సొమ్ముకాదా? దీనిపై బీజేపీ నాయకులు, మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ స్వయంగా ప్రజల సొమ్ము దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి తెలంగాణా ఏటీఎం అయ్యిందని ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయం నిజంకాదా? దీనిపై హరీశ్ రావు సమాధానం ఇచ్చేదమ్ముందా ? బీఆర్ఎస్ 10పది సంవత్సరాల పాలనలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం అవినీతి సొమ్ము, ప్రభుత్వ, మిగులు, వక్ఫ్, దేవాదాయ, ఎస్సి, ఎస్టీల అసైన్డ్, భూదాన్ మొదలగు వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టి, తెలంగాణ ప్రజలను తీరని మోసం చేసింది నిజంకాదా? ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం,పేదలకు మూడెకరాల వ్యవసాయ భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ళు, సాగునీరు, ఇంటింటికీ త్రాగునీరు, అమర వీరులందరి కుటుంబాలవారికి పది లక్షల రూపాయలు, ఉద్యోగం లాంటి హామీలు గుప్పించి పేదప్రజలను వంచించిన కేసీఆర్ కుటుంబ పాలననను బొంద పెట్టినను మీకు సిగ్గులేదా? స్వయం కృషితో, తెలంగాణ ప్రజల ప్రియతమ నాయకునిగా, సమయం చూసి కేసీఆర్ ను మట్టి కరిపించి బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ముఖ్యమంత్రైన రేవంత్ రెడ్డినా మీరు విమర్శించేది. కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ నాయకులు గానీ.. మరీ ముఖ్యంగా హరీష్, కేటీఆర్ మాట్లాడే ముందు మీరు మీ కుటుంబం చేసిన అవినీతి, దుర్మార్గాలు, నా లాంటి ఎంతోమంది ఉద్యమ నాయకుల జీవితాలను నాశనం చేసి ఉసురు తీసుకున్న మీకు ప్రజలు సరియైన బుద్ధిచెప్పారని రవీంద్ర నాయక్ దుయ్యబట్టారు.