- హౌసింగ్ కాలనీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన.. త్వరలో లబ్ధిదారుల ఎంపిక.
- హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, సాగునీరు, త్రాగునీరు అందించడమే నా ధ్యేయం..
- రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటిం చిన రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ముందుగా హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీ ప్రక్కనగల స్థలంలో 14 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఐటిఐ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. అనంతరం హౌసింగ్ కాలనీ పనులను పరిశీలించి అన్ని బ్లాకులను పనులు పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని హౌసింగ్ అధికారులకు మంత్రి ఆదేశించారు. కాలనీ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. అక్కడినుండి లింగగిరి గ్రామంలో లింగగిరి నుండి కల్మల్ చెరువు వరకు 26 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అమరవరం గ్రామంలో అమరవ రం నుండి అలింగాపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 23 కోట్లతో జరిగే పనులకు శంకుస్థాపన చేశారు. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో మేళ్లచెరువు నుండి చౌటపల్లి వరకు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంత రం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనె ఆదర్శ కాలనీగా హుజూర్‌నగర్ హౌసింగ్ కాలనీ ని తీర్చిదిద్దుతానని, కాలనీకి అన్ని మౌలిక వసతులు కల్పించి త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక చేస్తామని మంత్రి(Minister) పేర్కొన్నారు. ఈ కాలనీ 10 సంవత్స రాలుగా నా తపస్సని త్వరలో అన్ని పనులు పూర్తిచేస్తానని మంత్రి తెలిపారు. జాన్ పాడు, పాలకీడు మండలాలలో 5,560 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకై రూ.120 కోట్లతో జరుగుతున్న లిఫ్టు పనులను పరిశీలించడమైనదని పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి ఆదేశించారు. నియోజక వర్గంలోని చదువుకున్న యువత కొరకు 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ పను లు మొదలు పెట్టామని, ఇప్పుడు 14 కోట్లతో బేసిక్ ఐటిఐ బిల్డింగ్ కొరకు శంకుస్థాపన చేయడం జరిగిందని, దీనివలన ఎంతోమంది యువత ఉద్యోగాలు పొందగలుగుతారని మంత్రి అన్నారు. విద్యా ,వైద్యం, విద్యుత్తు, అన్ని విషయాలలో ముందుకు పోతున్నామని హుజూర్‌నగర్ నియోజక వర్గాన్ని రాష్ట్రంలోని ఒకటవ స్థానాలలో నిలుపుతానని మంత్రి తెలియజేశారు. లింగగిరి నుండి కల్మల్ చెరువు వరకు 13 కిలోమీటర్ల రోడ్డు 26 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ రోడ్డు వలన లింగగిరి, సర్వారం, గానుగ బండ, గార కుంట తండా మిగిలిన చిన్న చిన్న తండాలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా సింగిల్ రోడ్డు ఉండకూడదు అన్ని డబల్ రోడ్లుగా మార్చి ప్రజలకు సౌకర్యవం తంగా చేయాలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, పథకాలకు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించారని లబ్ధిదారుల పేర్లను జాబితాను జనవరి 21 నుంచి 24 తారీకు వరకు జరిగే గ్రామసభలలో ప్రదర్శిస్తారని జాబితాలో తమ పేర్లు లేనియెడల ఆందోళన చెందనఅవసరం లేదని గ్రామ సభలో దరఖాస్తులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డు జారీకి సంబంధించి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కార్డులు అందజేస్తామని అన్నారు. గ్రామ సభల్లో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించిన వాటిని పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. గ్రామ సభలలో మీ అభిప్రాయాలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భూములేని కూలీలు ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులపాటు పని కి వెళ్లిన వారె అర్హులని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు, మండల అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలు ఉంటే ప్రజలు వారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. జనవరి 26 నుండి 4 పథకాలు అమలు పరుస్తామని పేర్కొన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు ఇల్లు లేని వారు గ్రామసభలో దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని తెలిపారు. గ్రామ సభలలో ప్రజాభిప్రాయాలు పరిగణములోకి తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ ఈ ఆర్ అండ్ బి సీతారామయ్య, డీఈ,ఏఈ, ఆర్డీవో శ్రీనివాసులు, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.