Friday, March 14, 2025
spot_img

ధనకుంటపై దయచూపని అధికారులు

Must Read
  • కుంటలను మాయం చేస్తున్న కేటుగాళ్లు
  • చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫ‌లం
  • నామ‌మాత్ర‌పు ప‌ర్య‌వేక్ష‌ణ‌.. చ‌ర్య‌లు శూన్యం..
  • ఇరిగేషన్, రెవిన్యూ అధికారుల‌ మౌనం దేనికి సంకేతం..
  • క‌లెక్ట‌ర్‌గారూ చ‌ర్య‌లు తీసుకోండి – స్థానికులు

ప్రభుత్వ భూములైన గ్రామకంఠమైన లేదా కుంట శిఖాలైన వారి కన్ను పడిందా కబ్జా కావాల్సిందే,వారి కబంధహస్తాల్లో చేరావాల్సిందే, ఏదేమైనా కబ్జాకోరుల ఆగడాలను ఆపడం ఏ అధికారి, ఎవరితరం అయ్యేనే. ప్రభుత్వ భూములను కాపాడడంలో మండల కేంద్ర అధికారులు విఫలమయ్యారనే చెప్పాలి. మండల కేంద్రంలో ఏకంగా ధనకుంటకు సంబంధించిన శిఖం భూమిని కాజేయాలని చూసిన కబ్జాకోరులకు కళ్లెం వేసే వారు ఎవరు వారిని ఆపేది ఎవరు. సుమారు 100ఎకరాలకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సాగు, త్రాగు నీరు అందిస్తూ, భూగర్బ జలాలను పెంపొందించడానికి, చేప పిల్లల పెంపకానికి సైతం అవకాశం వుండి కూడా కేవలము ఈ కుంటపై అధికారులకు అవగాహన లేకపోవటము, నిర్వహణలోపము, కొందరు అక్రమార్కుల స్వార్ధము, దౌర్జన్యము కారణంగా ధనకుంట ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగు అయ్యాయి.

1986-1987వ దశకము వరకు గ్రామ రెవెన్యూ రికార్డులలో సదరు ధనకుంట భూమిని శిఖము భూమిగా పేర్కొన్నప్పటికి అక్రమార్కులు తమకున్న పలుకుబడిని ఉపయోగించి, రికార్డులలో శిఖము అన్న పదము తొలగించి పట్టా భూమిగా మార్పు చేయించుకుని పట్టాదారు పాసు పుస్తకము, టైటిల్ డీడ్ లు పొంది బ్యాంకుల నుండి వ్యవసాయ, తనఖా ఋణాలు, కరువు-ప్రకృతి విపత్తుల సమయములో ప్రభుత్వము అందించే సహాయముతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సహాయాలను, రైతుబంధు డబ్బులు సైతం పొందినారు. ఇప్పటికీ పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు వ్యవసాయ శాఖ గత 7ఏళ్లుగా రైతు బంధు డబ్బులు వేయటం, బ్యాంక్ లు పంట రుణాలు అందించటం గమనార్హం. ప్రస్తుతము సదరు వ్యక్తులు ఇకపై ఈ యొక్క ధన కుంటలో ఎటువంటి నీరు నిలువ వుండకుండా వుండేందుకు జేసిబి ఉపయోగించి ఒక వైపు నుండి కాలువలాగా చేసి ఎప్పుడూ వచ్చిన నీరు అప్పుడు వెళ్లిపోయే విధంగా ఏర్పాటు చేసి శిఖం భూమి 25.19ఎకరములను పూర్తిగా తమ ఆదీనములోనికి తెచ్చుకొని కుంట లోపలి భాగము మొత్తము మట్టితో నింపి వందల ఏళ్ల క్రితం నిర్మించిన కట్టకు సమాంతరంగా చదును చేసి వెంచర్ గా మార్చి ప్లాట్లుగా మార్చుటకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వ్యవసాయ శాఖ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారని విమర్శలు వస్తున్నా లోపల‌ జరిగే అక్రమాలు పెరుమాళ్ళుకే ఎరుక!గుండ్లపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నం.14లో గల 25.19 ఎకరముల శిఖం(ధన కుంట)భూమిని గ్రామ నక్ష మరియు భూ-రికార్డులను పరిశీలించి, సర్వే చేయించి సదరు సర్వే నంబరు 14ను రికార్డులలో తిరిగి శిఖం భూమిగా మార్పు చేసి, అభివృద్ది పనులు నిర్వహించి సదరు భూమిపై నుండి అక్రమార్కులను ఖాళీ చేయించి పూడికతీత మరియు ఇతర అభివృద్ది పనులు నిర్వహించి సుమారు 500 ఎకరాలకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సాగు నీరు అందించగలిగి, గ్రామంలో కూడా భూగర్భ జల అభివృద్ది జరిగే అవకాశం ఉండి, పెద్ద ఎత్తున చేపల పెంపకానికి అవకాశము వున్న ధన కుంటను పరిరక్షించి సుమారు 5000 మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి కల్పిస్తే స్థానికంగా అత్యధిక జనాభా కలిగిన రైతులకు,ముధిరాజులకు ఎంతగానో ఉపయోగపడడంతో పాటు గ్రామములో కూడా భూగర్భజలము పుష్కలంగా పెరిగే అవకాశము లేకపోలేదు అంటున్న గ్రామ ప్రజలు.

బల్మూరి తిరుపతయ్య రైతు మాట్లాడుతూ.వందల ఏళ్ల చరిత్ర కలిగిన ధనకుంటను నామరూపం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి తనకుంటను కాపాడే విధంగా అడుగులు వేయాలని,ధనకుంట మరమ్మతులు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గుండ్లపల్లి మండలం తహసిల్దార్ ఆంజనేయులును వివరణ.మాట్లాడుతూ.ధన కుంటకు సంబంధించిన పహానిలు మా వద్ద ఉన్నాయని 1966,67 సంవత్సరంలో ధన కుంట శిఖంగానే పేర్కొనబడిందని, అనంతరం 1971, 72 సంవత్సరాల లో శిఖం పట్టగా మార్చి పలువురు పట్టా చేసుకోవడం జరిగిందని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, పై అధికారుల ఆదేశాల మేరకు వేచి చూస్తున్నామని వివరించడం జరిగింది.

ఇరిగేషన్ డిఈ డిండి మండలం అధికారి వివరణ..
మాట్లాడుతూ.ధనకుంట చికం లేదా పట్టా భూమి లేదా ప్రభుత్వ భూమి మా వద్ద పత్రాలు లేవు అని నిర్లక్ష్యపు సమాధానాలు వివరిస్తూ మాట దాటు వేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదేమైనా నల్లగొండ జిల్లా కలెక్టర్ స్పందించి ధన కుంట శిఖం 25 ఎకరాల 19 భూమిని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని నిండి మండల కేంద్ర ప్రజలు కోరుతున్నారు. కుంటలకు కుంటలు సైతం అక్రమార్కుల చేతిలో కబంధహస్తాలలో చెరనుండి విడిపించుకోలేని పరిస్థితిలో ఉండిపోతే రేపటి భవిష్యత్తుకు లేదా తరాలకు గుంటలు గతంలో ఉండేవి పాఠ్యపుస్తకాలు మాత్రమే చదవడం జరుగుతుందని,తెలుస్తుంది ఏదేమైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కుంట శిఖం భూమిని కాపాడే విధంగా అడుగులు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS