-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి విక్రమార్కకి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు.శాసనమండలిలో కేసీఆర్ తన ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా? అని నిలదీశారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 08 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని గుర్తుచేశారు.ఇప్పుడు ఆ పార్టీ ఆ నాయకులు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని బీఆర్ఎస్ పార్టీ ఖాతం అయిపోయిందని,బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఉన్న 11 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు.కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని,ఆ భూమిను వేలం వేసి వచ్చిన డబ్బును రుణమాఫీకి ఉపయోగించాలని తెలిపారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.