Friday, September 20, 2024
spot_img

డిస్టెన్స్ ‘బీఎడ్’ ఎడ్యూకేషన్

Must Read
  • శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ ఇష్టారాజ్యం
  • ఎన్సీటీఈ నిబంధనలు భేఖాతర్
  • ఒకే వ్యక్తి, ఒకే ఏడాది మూడు కాలేజీల్లో ప్రిన్సిపాల్ గా విధులు
  • నాలుగేళ్లుగా ఇదే తతాంగం
  • వికారాబాద్ లోని నవాబ్షా కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ కూడా సేమ్ టు సేమ్
  • ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిబంధనలు తుంగలోకి

‘చదువు రాక ముందు కాకరకాయ… చదువు వచ్చాక కీకరకాయ’ అన్నాడంట. పెద్ద చదువులు ఉద్యోగాలు రాక, విద్యను వ్యాపారం చేద్దామని బీఎడ్ కాలేజీలు పెట్టుకున్న కొందరూ వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కనీసం పదో క్లాస్ చదువుకున్నోడి తెలివి కూడా లేకపోతే ఏం లాభం. పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులను తయారు చేసే బీఎడ్ కాలేజీలు డబ్బులకు సర్టిఫికేట్ ఇస్తున్నాయి. పైసలకు కక్కిర్తి పడి కొన్ని బీఎడ్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది. జాయినింగ్ లో స్టూడెంట్స్ తో నేరుగా కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. పరీక్షలు రాస్తే చాలు మేము పాస్ అయ్యేలా చూస్తం అంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కాలేజీలు ఎన్సీటీఈ నిబంధనలు భేఖాతర్ చేస్తున్నాయి. పలు బీఎడ్ కాలేజీలు డిస్టెన్స్ ఎడ్యూకేషన్ మాదిరిగా కాలేజీ నడిపిస్తుండడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పరిధిలోని శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్, భగీరథ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్, షాహనాజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ మరియు నవాబ్ షా కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్.. ఈ నాలుగు బీఎడ్ కాలేజీలు యూనివర్సిటీ నామ్స్ ను ఏ మాత్రం పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు’ బీఎడ్ కాలేజీలు పెట్టుకోగానే సంబురం కాదు.. వాటిని మెయింటెన్ చేయడం రాకపోతే ఏం లాభం. రెగ్యూలర్ నడవాల్సిన బీఎడ్ కాలేజీలు కేవలం అడ్మిషన్లు తీసుకొని లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వీరికి డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ అమ్ముకోవడంపై మేథావులు మండిపడుతున్నారు. బీఎడ్ కాలేజీలను ఓ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ లా మార్చడంపై ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ సాకారం ఉండే ఉంటుందని.. ఉన్నతాధికారుల సపోర్ట్ తోనే ముందుకు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ నియమ, నిబంధనలు పాటించని బీఎడ్ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఒకే వ్యక్తి మూడు కాలేజీలకు ప్రిన్సిపాల్:

‘కడుపుతో ఉన్నామె కనక మానుతుందా’ అన్నట్టు దొంగతనం చేసే ముందు కొందరు కొంచెం కూడా ఆలోచించరు. ఒక వ్యక్తి, ఒకే ఏడాది మూడు కాలేజీల్లో ప్రిన్సిపాల్ గా పెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. దీన్ని బట్టే కాలేజీల యాజమాన్యాలకు మెదడు తలలో ఉందో, మోకాలులో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీ నిధి కాలేజీలో నాలుగేళ్లుగా పెండెం రాంబాబు ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నాడు. అదే వ్యక్తి మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని రేయాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ లో కూడా ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. అలాగే ఆంధ్రలోని ప్రకాశం జిల్లాలో ఉన్న కృష్ణ మహిళా కాలేజ్ లో ప్రిన్సిపాల్ ఆయనే ఉండడం గమనార్హం. ఒకే వ్యక్తి, ఒకే ఏడాది మూడు కాలేజీలకు ఎలా ప్రిన్సిపాల్ గా చేస్తాడనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. అంటే ఇక్కడే బీఎడ్ కాలేజీల డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు శ్రీనిధి కాలేజీ రిజిస్ట్రార్ దొంగ సంతకం పెట్టించి అదే లిస్ట్ ఎన్సీటీఈకి కూడా పంపింది. వికారాబాద్ లోని నవాబ్షా కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోంది. అక్కడ ప్రిన్సిపల్, ఇద్దరూ లెక్చరర్ లతోనే బీఎడ్ కాలేజ్ నడిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇలా పైసలకు కక్కుర్తిపడి యూనివర్సిటీ నిబంధనలు పాటించని బీఎడ్ కాలేజీలపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This