తెలంగాణ రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి అక్షర జ్యోతి చారిటీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం, వారి విద్యా ప్రయాణానికి మద్దతు ఇవ్వడం తమ లక్ష్యమని తెలిపారు టిడిఎఫ్ టీం సభ్యులు గుప్పల్లి సంద్య,పబ్బా కవిత.సోమవారం సిద్దిపేట జిల్లా, కోమురవెల్లి మండలం, జెడ్పిహెచ్ఎస్ గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన విరాళ కార్యక్రమంలో పాల్గొని బెంచీలను అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను మెరుగుపరచడం, విద్యార్థుల సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా, టీడీఎఫ్ (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం) టీం అక్షర జ్యోతి చారిటీ పనిచేస్తుందని తెలిపారు.
దింట్లో భాగంగానే ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను విరాళంగా ఇచ్చామని పేర్కొన్నారు.విద్యా సదుపాయాలను అందించడం, పిల్లలకు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని సృస్థించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేయబడుతోందని వెల్లడించారు. 2014లో అక్షర జ్యోతి చారిటీ కార్యక్రమం స్థాపించబడిందని తెలిపారు.పాఠశాలకు బెంచిలు విరాళంగా ఇచ్చినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు టిడిఎఫ్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త బెంచీలు తరగతి గదిలోని వాతావరణాన్ని గణనీయంగా మెరుగుపరచి, అభ్యాసం, అభివృద్ధికి అనుకూలంగా ఉండేలా చేస్తాయని ఆశించారు. ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ వుప్పల, వైస్ ప్రెసిడెంట్ నగేష్ బత్తుల, మహేష్ యాదవ్,జనరల్ సెక్రెటరీ నాగరాజు అడ్డగుల్లా, శ్రీకాంత్ బెల్డే,ప్రవీణ్ గుపల్లి, రాజశేకర్, రాజ్ పూజారి, శ్యామ్ లాయగల, మాధవి, భాగ్య సజ్జన్, నవ్య బత్తుల, కన్య, అడ్వైజరీ బోర్డు సభ్యులు కమలాకర్ రావు, శ్రవణ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి పింగళి, డా.చిట్టి మోహన్ రావు, డా.వెంకట కమలాకర్ రావు ఈ టీంలో సభ్యులుగా ఉన్నారు.