రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ వరద బాధితుల కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.తాజాగా అల్లుఅర్జున్,ప్రభాస్,రామ్ చరణ్‌తో పాటు అక్కినేని కుటుంబం కూడా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.
అల్లు అర్జున్ :
ఇరు రాష్ట్రాల వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.ఈ విషయన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఏపీ,తెలంగాణలో వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు కలిచివేస్తున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి క్లిష్టమైన సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.కోటి విరాళంగా ఇస్తున్నని తెలిపారు.ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అల్లు అర్జున్ రాసుకోచ్చాడు.
ప్రభాస్ :
రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలబడేందుకు రెబెల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు.ఏపీ,తెలంగాణలో వరద బాధితుల కోసం రూ.02 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు,తెలంగాణకు కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ డొనేషన్ ఇచ్చారు.
రామ్ చరణ్ తేజ్ :
రామ్ చరణ్ తేజ కూడా వ్యక్తిగతంగా వరద బాధితుల కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.50 లక్షలు,తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.50 లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తోడుగా ఉన్నామంటూ చేయుత అందించాల్సిన సమయం ఇది అని తెలిపారు.నా వంతు బాధ్యతగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
అక్కినేని కుటుంబం,గ్రూప్ కంపెనీస్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు అక్కినేని కుటుంబం,గ్రూప్ కంపెనీస్ ముందుకొచ్చాయి.ఈ మేరకు రూ.కోటి రూపాయల సహాయం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నామని ప్రకటించారు.ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.