- భారాస నేతలు అధికారం కోల్పోయినప్పుడల్లా ప్రజలను రెచ్చగొడుతున్నారు
- విమర్శలనే బీఆర్ఎస్ ఎజెండాగా పెట్టుకుంది
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భారాస నేతలు అధికారం కోల్పోయినప్పుడల్లా ప్రజలను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టిందని విమర్శించారు. కేవలం విమర్శలనే ఆ పార్టీ ఎజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలని బలి చేయవద్దు అని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం, ఉద్యోగాలు ఇవ్వడం, రుణామాఫీ చేయడం ఇందులో ఏది ప్రభుత్వ వైఫల్యమో కేటీఆర్ చెప్పాలని అన్నారు. కులగణన విప్లవాత్మక నిర్ణయమని..రాష్ట్ర అభివృద్దికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ కాబోతుందని తెలిపారు.