డ్రగ్స్ ఫేడ్లర్ మస్తాన్ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి అక్కడినుండి పారిపోయాడు.పోలీసులు అప్పటినుండి మస్తాన్ సాయి పై నిఘా పెట్టారు.
మరోవైపు లావణ్య,రాజ్ తరుణ్ కేసులోనూ మస్తాన్ సాయి పేరు వినిపించింది.అతని ఫోన్లో చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ వీడియొలను అడ్డుగా పెట్టుకొని అనేక మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తునట్టు తెలుస్తుంది.ప్రస్తుతం అతని ఫోన్లో లభించిన వీడియోస్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.