ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హైడ్రామా నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తాన్దే వివాదంలో చిక్కుకున్నారు. పాల్ఘార్ జిల్లాలోని ఓ హోటల్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినోద్ తాన్దె డబ్బులు పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాదీ ( బీబీఏ ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ ఆరోపణలు చేయడంతో, కేంద్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంచడానికి వినోద్ తాన్దే వచ్చారని హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. అయిన్ను ఒక హోటల్ లో చూశానని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వినోద్ తాన్దే, బిజెపి పార్టీల చర్యలు తీసుకోవాలని కోరారు.