Thursday, November 21, 2024
spot_img

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై క్లారిటీ ఇచ్చిన ఈడీ

Must Read
  • మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు : ఈడీ
  • మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఇళ్లు,కార్యాలయాలలో సోదాలు నిర్వహించాం
  • రూ.300 కోట్లలో మైనింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ సంచలన ప్రకటన విడుదల చేసింది.గురువారం రోజున మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన సోదరుని నివాసంలో మరియు సంబంధించిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సోదాల నేపథ్యంలో ఈడీ అధికారులు సంచలన ప్రకటన విడుదల చేశారు.మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈడీ కీలక ఆభియోగం మోపారు.మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఇళ్లు,కార్యాలయాలలో సోదాలు నిర్వహించామని ఈడీ తెలిపింది.సంతోష్ స్యాండ్,సంతోష్‌ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు.రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్టు ఈడీ పేర్కొంది.ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారన్నారు.బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు ఈడీ తెలిపింది.అక్రమ మార్గంలో సంపాంధించిన డబ్బు మొత్తాన్ని రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఈడీ వివరించింది.సోదాల సందర్బంగా రూ.19 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాకుండా.. బినామీ పేర్లతో లావీదేవీలను గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంక్ లాకర్స్‌ను కూడా ఇంకా తెరవాల్సి ఉందన్నారు. మధుసూదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది ఈడీ.సుదీర్ఘంగా సాగిన ఈ సోదాల్లో,ఈడీ అధికారులు ఏమీ గుర్తించలేదని, కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారంటూ సోదాల తర్వాత మహిపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు.ఒక్క రూపాయి కానీ, ఒక్క తులం బంగారం కానీ, ఎలాంటి పత్రాలు కానీ తీసుకెళ్లలేదని.. కేవలం కొన్ని జిరాక్స్ పేపర్లు మాత్రం పట్టుకెళ్లారంటూ మహిపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కక్షతోనే జరిపిస్తున్నాయని మహిపాల్ రెడ్డి ఆరోపించారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS