- ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై ఈడీ రైడ్స్
- 11 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు
- విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు
హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై 11 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నామని ఈడీ పేర్కొంది.16 దేశాల్లో విద్యార్థులకు ఆహారం,విద్య అందిస్తామని కెనడా,యుఎస్,ఆస్ట్రేలియా,జెర్మనీతో పాటు ఇతర దేశాల్లో నిధులు సేకరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు.ఆరోపణలు రావడంతో ఏపీ,తెలంగాణ,మహారాష్ట్ర,కేరళ,కర్ణాటక లో సోదాలు నిర్వహించారు.హోంబుక్ ఫౌండేషన్ పేరుతొ నిధులు మళ్లించినట్లు ఈడీ తెలిపింది.ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉందని ఈడీ అధికారులు వెల్లడించారు.