తెలంగాణ రాష్ట్రంలో విద్య కమిషన్ ఏర్పాటుకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ప్రి ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.చైర్మన్,ముగ్గురు సభ్యులతో విద్య కమిషన్ ఏర్పాటు కానుంది.కమిషన్ చైర్మన్,సభ్యులను త్వరలోనే నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.విద్యావ్యవస్థలో విప్లత్మక మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలుమార్లు చెప్పారు.దింట్లో భాగంగానే విద్య కమిషన్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.