Saturday, November 23, 2024
spot_img

గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి

Must Read
  • రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాలలో అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధిలైట్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, క్రీడా ప్రాంగణాలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతల వారీగా చేపట్టి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సర్పంచుల పాత్ర కీలకమని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి అన్నారు. ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన, సర్పంచుల బిల్లుల చెల్లింపులలో గత, తాజా ప్రభుత్వాలు జాప్యం వహించి సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెండింగ్ బిల్లుల విషయమై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించిన కాగితానికే పరిమితమయ్యాయని అన్నారు. ఈమేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనరు పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సముద్రాల రమేష్, పంబ కరుణాకర్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS