ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో 09 మంది మావోలు మృతిచెందారని అధికారులు వెల్లడించారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఘటన స్థలంలో భద్రత బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు డిఆర్జీ (drg) బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని బస్టర్ రేంజ్ పోలీస్ ఇన్స్ పెక్టర్ జనరల్ సుందర రాజ్ తెలిపారు.