ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించింది.మరోవైపు సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది.
పొట్టిశ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణ, ఐటీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0, ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.