Friday, November 22, 2024
spot_img

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

Must Read
  • ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52మంది
  • 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌
  • ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు.. మూతపడ్డ వైన్‌ షాపులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌ కుమార్‌ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. 27వ తేదీ సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 4,61,806 మంది పట్టభద్ర ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 287007 మంది, మహిళలు 174794 మంది కాగా ఇతరులు ఐదుగురు ఉన్నారు. మూడు పార్టీలు ఈ స్థానంలో పాగా వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది. వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలవడం కాంగ్రెస్‌కు ఎంత ఆవశ్యకమో.. బీఆర్‌ఎస్‌కు కూడా అంతే అవసరం. అసలు ఈ ఎన్నిక పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో వచ్చింది కాబట్టి సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవడం బీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు గట్టిగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ తరఫున 12 జిల్లాల పరిధిలో పట్టభద్రుల సమావేశాలు నిర్వహించి తీన్మార్‌ మల్లన్న గెలుపుకోసం మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ప్రేమేందర్‌ రెడ్డికి మద్దతుగా ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలనే నినాదాన్ని రెండు పార్టీలు అందుకున్నాయి. కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకుడిగా నిరుద్యోగులకు సుపరిచితుడైన పాలకూరి అశోక్‌ కుమార్‌, ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌ కు గురైన బక్క జడ్సన్‌ ప్రచారం చేశారు. మొత్తానికి ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయి. పెద్దల సభలో పై చేయి సాధించాలని మూడు పార్టీలు పంతం మీదున్నాయి. మరి పట్టభద్రుల తీర్పు ఎటు అన్నది చర్చగా మారింది. ఇకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్‌ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో బంద్‌ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 27 సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్‌ మూసివేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగని ప్రాంతంలో మాత్రం మద్యం దుకాణాలు తీసి ఉంటాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి రాకేశ్‌ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు జూన్‌ 4వ తేదీన కూడా తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 27వ తేదీ మంగళవారం రోజున జరిగే పోలింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ రోజు ఉదయం6 నుండి సాయంత్రం 8 వరకు144 సెక్షన్‌ అమలు ఉంటుంది. ఇక మూడు జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మొత్తం 4 లక్షల 61 వేల 806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్షా 73వేల 406 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉండగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఉన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS