Friday, January 31, 2025
spot_img

దేవుడి భూమికి దేవుడే దిక్కు…

Must Read
  • ఎండోమెంట్ క‌మిష‌న‌ర్ సీతారామచంద్రస్వామి భూమిని కాపాడ‌లేక‌పోతున్నాడు
  • రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్
  • అత్తాపూర్ లోని సర్వే నెం.384లో 12ఎకరాలు మాయం
  • దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు
  • పి.గోపాల్ రెడ్డి, కె.విజయేంద‌ర్ రెడ్డి ఇష్టారాజ్యం
  • రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు
  • ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఎండోమెంట్ ట్రిబ్యున‌ల్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు
  • ట్రిబ్యున‌ల్ ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణ ప‌నులు
  • ఎండోమెంట్ అధికారులు అడ్డుకునేందుకు య‌త్నిస్తే ప్రైవేట్ సైన్యంతో అడ్డ‌గింత‌
  • ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి గారూ జెర్రా చూడండి..
  • దేవుడి భూమిని కాపాడండి సారూ అంటున్న స్థానికులు

తెలంగాణ రాష్ట్రంలో అన్నం తినేవారి కన్నా భూములను మింగేవారు ఎక్కువై పోయారు. ప్రభుత్వ, అసైన్డ్, పేదలు, అమాయకుల భూములను కొట్టేసిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, ఇవన్నీ అయిపోయినట్టుంది ఇప్పుడు దేవుళ్ల జాగలపై పడ్డారు. వీళ్లకు ఏం పోయే కాలం దేవుడి భూమినే కబ్జాచేస్తున్నారు మీ నోట్లో… పుట్టా అంటూ తిట్లపురాణం అందుకుంటున్నారు ప్రజలు. “అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు” అన్నట్టుగా దేవాదాయ శాఖ అధికారులు పట్టింపు లేకపోవడంతో దేవుడి భూములు మాయం అవుతున్నాయి. రాజధానిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాకోరులకు ఆశలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఉన్న దేవాలయాల భూములను అక్రమార్కులు పొతం పెడుతున్నారు. నోరు లేని దేవుడి భూములను కొట్టేస్తే ఎవరూ అడ్డం రారులే అనుకుంటున్నారు. యథేచ్ఛగా భూముల కబ్జాకు పాల్పడుతున్నారు. రాజకీయ అండ, డబ్బు బలంతో కొందరు భూములను పొతం పెడుతున్నారు. మాముళ్లు ముట్టజెప్పుతూ అధికారులను మచ్చిక చేసుకొని తమ పని కానిచేస్తున్నారు. అక్రమ మార్గంలో దేవుడి భూములను సొంతం చేసుకుంటున్నారు. ప్రభుత్వ అసెన్డ్ భూములు, దేవుడి మాన్యం, దేవాదాయ, ధర్మదాయా శాఖకు చెంది భూములను రక్షించాల్సిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి కబ్జాకు గురైంది. అత్తాపూర్ లోని సర్వే నెం.384లో 12ఎకరాలు మాయం చేశారు. దేవుని భూమి కబ్జాకోరుల కంట‌పడడం జరిగింది. రాజధాని నగరమైన హైదరాబాద్ లోని అత్యంత కాస్లీ ఏరియా అయిన హైటెక్ సిటీ, సైబర్ సిటీకి అతి దగ్గరలో ఉన్న రాజేంద్రనగర్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గజానికి రూ.లక్షల్లో రేటు పలుకుతున్నాయి. అత్తాపూర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. గ్రామ సర్వే నెం 384లో 15.23ఎకరాల దేవాదాయ భూమి ఉంది. దానిలో సుమారు 12ఎకరాల భూమి కబ్జాకు గురికావడం జరిగింది. కోట్లు విలువ చేసే అట్టి భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. ఆ తర్వాత ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. దేవాదాయశాఖ భూమిలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీ సీతారామ చంద్రస్వామికి చెందిన భూమిని కబ్జాచేసి మరీ కట్టడాలు నిర్మిస్తుంటే చోద్యం చూస్తుండడం వెనుక ఆంతర్యమేంటో తెలియడం లేదు.

జీహెచ్ఎంసీ అధికారులు ఎలా అనుమ‌తులు ఇచ్చారు. ఎలక్ట్రి సిటీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు వ‌స‌తులు ఎలా క‌ల్పించారు. దేవుడి భూమిని దర్జాగా కొట్టేసి కట్టడాలు చేపడుతుంటే ఎండోమెంట్ నిద్రమత్తులో ఉండడం గమనార్హం. సుమారు వెయ్యి గజాలను కబ్జాచేసిన ఎస్ఎం గార్డెన్ యజమాని ఆ స్థలంలో యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయినా అధికారులెవరూ అడ్డుకునే పరిస్థితి లేదు. ఎండోమెంట్ కమిషనర్ దీనిపై మౌనంగా ఉండడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఎండోమెంట్ ట్రిబ్యున‌ల్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేశారు. ట్రిబ్యున‌ల్ ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణ ప‌నులు చేపడుతున్నారు. ఎండోమెంట్ అధికారులు అడ్డుకునేందుకు య‌త్నిస్తే ప్రైవేట్ సైన్యంతో అడ్డ‌గిస్తున్నారు. సీతారామ చంద్రస్వామి ఆలయానికి చెందిన సుమారు 12 ఎకరాల భూమి కబ్జాకు గురైతే దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అసలు దేవాదాయ భూమికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వకుంటే నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు. కోట్లు విలువ చేసే దేవాదాయ శాఖ భూమి అక్రమార్కుల చెరలో పడితే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీస్తున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించి, విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన అధికారుల‌పై శాఖ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకొని, దేవుడి మాన్యాన్ని క‌బ్జా చేసిన కబ్జాదారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

ఊరిస్తున్న కొత్త ఆదాయపన్ను చట్టం

పాతది ఉంటుందా.. కొత్తది వస్తుందా..? ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌(Budget) సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రవేశపెట్టనున్నట్లు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS