Sunday, January 19, 2025
spot_img

బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల..?

Must Read
  • అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌ అవసరంలేదు
  • రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు
  • రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుంది
  • ఈటల కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారు
  • రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
  • ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్‌
  • మీడియా స‌మావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ(BJP) అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారు అన్నది అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌ అవసరం లేదని అన్నారు. రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలని చెప్పారు. రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ అవుతారా అన్నది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయించే విషయంలో పూర్తి నిర్ణయాధికారం అధిష్టానానికే ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా, 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటల రాజేందర్.. 2004లో కమలాపూర్ నుంచి ఉపఎన్నికతో కలిపి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికల్లో మరోసారి ఈ స్థానం నుంచే గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ తర్వాత 2014లోనూ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2021లో టీఆర్ఎస్ అధిష్ఠానానికి తనకు మధ్య వచ్చిన విభేదాలతో పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ‌లో చేరారు. ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగి.. హుజురాబాద్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. అటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హూజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల.. రెండు చోట్లా ఓడిపోయారు. అయితే.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం మల్కాజిగిరి నుంచి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు ఈటల రాజేందర్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తెలంగాణ ఒక్క బీజేపీకే ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. గత 7 నెలలుగా జీహెచ్‌ఎంసీలో వీధిలైట్లకు నిధుల కొరత ఉందని అన్నారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు.. ప్రస్తుతం ఆ ఒరవడిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉండేదని గుర్తుచేశారు. ఆ పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టిందని విమర్శించారు. నగరంలో మెట్రో రెండో దశకు కేంద్రప్రభుత్వం తప్పకుండా సాయం చేస్తుందని.. అది తమ బాధ్యత అని అన్నారు.

Latest News

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్ పౌరుడు..!

అర్ధ‌రాత్రి నిందితుడు విజ‌య్ దాస్‌ను అరెస్ట్ సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా గుర్తించిన‌ట్లు వెల్ల‌డి ముంబ‌యి డీసీపీ కార్యాల‌యంలో విలేక‌ర్ల‌ సమావేశం వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్న ముంబ‌యి పోలీసులు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS