Thursday, November 21, 2024
spot_img

ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకున్న ‘ఎజైకిల్‌’…

Must Read
  • నగరం వేదికగా సైక్లింగ్ యొక్క ఆహ్లాదం, ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శించిన సైక్లింగ్‌ ప్రియులు

ఎలక్ట్రిక్ సైకిళ్లలో ప్రముఖ ఆవిష్కర్త అయినటువంటి ‘ఎజైకిల్‌’ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవ నేపథ్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సైక్లింగ్ ఔత్సాహికులు, వివిధ కమ్యూనిటీ నాయకులతో పాటు విశిష్ట అతిథులను ఒకచోట చేర్చ….ఆరోగ్యం, సుస్థిరత, సమాజ శ్రేయస్సు కోసం సైక్లింగ్ ప్రయోజనాలను ప్రోత్సహించేలా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రెస్టీన్ ప్రైమ్ మాల్‌ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మిస్టర్ వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్ మీర్ మోతేషామ్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎజైకిల్ సీఈఓ శ్రీ శ్రీనివాస్‌.డి తో పాటు పలువురు సైక్లింగ్‌ ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం పచ్చదనం, ఆరోగ్యకరమైన భవిష్యత్తును పెంపొందించడంలో సైకిళ్ల పాత్రను హైలైట్ చేసింది. ఈ సందర్భంగా శ్రీ మీర్ మోతేషాం తన ప్రయాణాన్ని, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను పంచుకున్నారు. వినూత్న ఎలక్ట్రిక్ సైకిళ్ల ద్వారా రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఎజైకిల్‌ సంస్థ కృషి, మిషన్ గురించి పలు అంశాలను సీఈఓ శ్రీ శ్రీనివాస్.డి వెల్లడించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీలో అన్ని వయసులకు చెందిన సైక్లింగ్‌ ప్రియులు పాల్గొని సైక్లింగ్ యొక్క ఆహ్లాదం, ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఔత్సాహికులు ఎజైకిల్‌ తాజా ఆవిష్కరణ ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌ల యొక్క ప్రయోగాత్మక ప్రదర్శనలను ఆస్వాదించారు. దీని సౌలభ్యం, పర్యావరణ అనుకూల లక్షణాలను సైక్లిస్టులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సైక్లింగ్ భద్రత, నిర్వహణ, ఎలక్ట్రిక్ సైకిళ్ల ప్రయోజనాలపై సమాచార వర్క్‌షాప్‌లను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎజైకిల్‌ సీఈఓ శ్రీనివాస్ డి. మాట్లాడుతూ., “ప్రపంచ సైకిల్ దినోత్సవం నేపథ్యంలో మనమంతా ఒక వేదికపైకి చేరి మార్పుకు నాంది అయినటువంటి సైకిల్‌ వేడుకలు చేసుకోవడం మంచి అనుభూతి. ఎజైకిల్‌ ఆధ్వర్యంలో సైక్లింగ్ చేయడానికి, చేయించడానికి కట్టుబడి ఉన్నాము. అందరికీ అనువైన, స్థిరమైన సైక్లింగ్‌ వృద్ధికి మా మిషన్‌ నిదర్శనంగా నిలుస్తుందని’’ తెలిపారు.

ముఖ్య అతిథి మీర్ మోతేషామ్ మాట్లాడుతూ., “నా శిక్షణతో పాటు జీవితంలో కూడా సైక్లింగ్ ఒక ముఖ్యమైన భాగం. ఈరోజు ఇక్కడ సైక్లింగ్‌కు మద్దతు చూపించిడం చాలా సంతోషాన్నిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయని” పేర్కొన్నారు.

Latest News

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS