Thursday, April 3, 2025
spot_img

అసలు రైతులకే రైతుభరోసా వర్తింపు

Must Read
  • పంటలు వేసిన వారి ఆధారంగా చెల్లింపులు
  • మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

అసలుసిసలు రైతులకే పథకం అంటూ..రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట వేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. 2024, డిసెంబర్‌ 24న ఏటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పర్యటించిన సీతక్క.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణ లక్ష్మ, షాది ముబారక్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ పాలకుల తప్పిదాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతును రాజును చేయడమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు రూ.21వేల కోట్లు పంట రుణమాఫీ చేశామని గర్వంగా చెప్పారు. పెండిరగ్‌ రుణమాఫీ జాబితాను పరిశీలిస్తున్నారు. పంట పెట్టుబడి సాయం కింది ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సహయం చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు స్కీమ్‌ స్థానంలో రైతు భరోసా అమలు చేయనున్నారు. రైతు బంధు నిధులు దుబారా అయ్యాయని గుర్తించిన రేవంత్‌ సర్కార్‌.. రైతు భరోసా స్కీమ్‌ విధివిధానాల రూపకల్పన కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్‌ నివేదిక సమర్పించిన అనంతరం.. సంక్రాంతి నుండి ఈ స్కీమ్‌ అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. బీఆర్‌ఎస్‌ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి స్కీమ్‌ వర్తింపజేయకుండా సీలింగ్‌ పెట్టి కేవలం పంట వేసే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క పై విధంగా కామెంట్స్‌ చేశారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS