పాతాళగంగలో పుణ్యస్నానానికి దిగిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాతాళగంగ వద్ద స్నానం చేయడానికి నదిలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అందులో మునగడంతో తండ్రి, కుమారులు మరణించారు. దీంతో గమనించిన స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.