ఇటీవల అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన పై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ప్రారంభించింది.దింట్లో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ ను ఎఫ్.బి.ఐ విచారణ చేయనుంది.ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సందర్బంగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.అయిన ప్రసంగిస్తున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో గాయాలతో ట్రంప్ బయటపడ్డ విషయం తెలిసిందే.అయితే ఈ ఘటనపై ఎఫ్.బి.ఐ దర్యాప్తు చేస్తుంది.దర్యాప్తులో భాగంగా ట్రంప్ ను కూడా విచారిస్తామని అధికారులు తెలిపారు.