Thursday, September 19, 2024
spot_img

వరద బాధితులకు సహాయం ప్రకటించిన సినీప్రముఖులు

Must Read

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ వరద బాధితుల కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

నందమూరి బాలకృష్ణ :

భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్ర బాధితులను ఆదుకునేందుకు నందమురి బాలకృష్ణ ముందుకొచ్చారు.ఏపీ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు,తెలంగాణ సీఎం సహాయం నిధికి రూ.50 లక్షల విరాళంగా అందించారు.రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకోవాలని ఆకాంక్షించారు.

జూనియర్ ఎన్టీఆర్ :

వరదలతో అతలాకుతలమైన రెండు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం టాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఎన్టీఆర్‌ ముందుకొచ్చారు.రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సవం ఎంతోగానో కలిచివేసిందని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విపత్తు నుండి త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని తన వంతుగా ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సీఎం సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తునట్టు పేర్కొన్నారు.

సిద్దు జొన్నలగడ్డ :

రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులను అండగా నిలిచేందుకు కథానాయకుడు సిద్దు జొన్నలగడ్డ విరాళన్ని అందించారు.తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.15 లక్షలు,ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.15 లక్షల విరాళాన్ని అందించారు.

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్‌,నిర్మాతలు చినబాబు,నాగవంశీ సైతం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.సంయుక్తంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.ఈ మేరకు ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షల చొప్పున విరాళంగా ప్రకటించారు.భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి,ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలిచివేశాయని తెలిపారు.ఈ విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతుగా సాయంగా చేయూతనందిస్తున్నామని ప్రకటనలో తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This