Friday, November 15, 2024
spot_img

మ‌న భావిత‌రాల కోస‌మే…

Must Read
  • సీఎం రేవంత్‌ కష్టపడుతున్న‌ది రాష్ట్రం బాగుకోసమే
  • కొందరు పనిగట్టుకుని హైడ్రాను బూచిగా చూపించే ప్రయత్నం
  • రాజకీయ రియల్టర్లు, కబ్జాలు చేసిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు
  • మూసీనది ప్రక్షాళనకు ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు
  • రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది..
  • మూసీ నది ప్రక్షాళనపై రైతులతో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

మన భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా వల్ల సీఎం రేవంత్‌కు మంచి పేరు వస్తుందన్న భయంతోనే ప్రతిపక్షాలు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ భవిష్యత్తు గురించి గాని భావితరాల మనుగడకోసం ఆయా పార్టీలు ఆలోచన చేయడం లేదని ఆయన వేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో రాజకీయ అండదండలతో కబ్జాలు చేసిన నాయకులే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. శనివారం నాగోల్ లోని శుభమ్ గార్డెన్స్లో మూసి నది ప్రక్షాళన పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంపై కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాలు పనిగట్టుకుని అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రైతులు స్వచ్ఛందంగా హాజరవడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎంపీ అన్నారు..

హైడ్రాను ప్రభుత్వం ఎందుకు తెచ్చింది..

కాలుష్య కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళనకు జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకింత ప్రయత్నించినా అది నివేదికలు, అంచనాల దశ దాటలేదని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజల జనజీవనంతో పెనవేసుకున్న మూసీ నది నీరు, ఇపుడు విషతుల్యంగా మారింది. ఏళ్లుగా మూసీ నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య తక్కువేం కాదు.నకిరేకల్ నియోజకవర్గం సోలిపేట గ్రామం వద్ద మూసీ నదిపై మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టును 1960ల్లోనే నిర్మించారు. గతంలో ఈ నది నీరు సాగు, తాగు, పాడి, మత్స్య రంగాలకు ఉపయోగపడేది. హైదరాబాద్ దాటి వచ్చాక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూసీపై 24 కత్వాలు నిర్మించారు. వీటి ద్వారా సాగు నీరు అందేది. ఇదే మూసీ నీటిపై ఆధారపడిన ఆసిఫ్ నహర్ వంటి చిన్న తరహా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలూ ఉన్నాయి. కానీ.. కాలుష్య నీటితో పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.అంతర్జాతీయ నగరంగా పేరున్న హైదరాబాద్‌లో మూసీ దుర్గంధాన్ని వెదజల్లుతోంది. మానవ వ్యర్దాలు, ఔషధ, రసాయన పరిశ్రమల వ్యర్థాలతో విషతుల్యంగా మారిన మూసీ నీరు ప్రజలకు అనారోగ్యాలను పంచుతోంది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం మూసీ శుద్ధీకరణ, సుందరీకరణకు నడుం కట్టడంతో మూసీ పరీవాహక ప్రాంతాల వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మూసీ ఆక్రమణల తొలగింపు వివాదాస్పదం కావడం, ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నిర్వాసితుల పక్షాన ఆందోళనలకు దిగుతుండడంతో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు జిల్లా రైతాంగం ఒక్కటవ్వడం సంతోషమని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది..:-

ప్రభుత్వం ఎస్టీపీలతో మురికి నీటిని శుద్ధి చేసి,గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు. మూసీ నదిని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతుంటే, ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించి మూసి ప్రక్షాళన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టేందుకు రైతాంగానికి ,ప్రజలకు నిజాలను వెల్లడిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే అధ్వానంగా తయారైన మూసీ నదిని, ఇకనైనా శుద్దీకరించి కాపాడుకోకుంటే మూసి పరీవాహక ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రభుత్వం నిస్వార్ధంతో చేపట్టిన కార్యక్రమానికి రైతులు , ప్రజలు మద్దత్తు ఇవ్వాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు..ఈ కార్యక్రమంలో ప్రజలు ఈ కార్యకమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, రంగారెడ్డి నల్గొండ, భువనగిరి జిల్లాల డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS