Friday, September 20, 2024
spot_img

మాజీమంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

Must Read
  • గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి
  • సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు

మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి తెదేపా తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీతాదేవి మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సీతాదేవి తనదైన ముద్రవేశారని చంద్రబాబు కొనియాడారు. ఆ తర్వాత సీతాదేవి బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. యెర్నేని సీతాదేవి మాత్రమే కాకుండా ఆమె కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే కావడం గమనార్హం. ఆమె భర్త నాగేంద్రనాథ్‌ ఆంధప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. నాగేంద్రనాథ్‌ ఏడాది క్రితం మరణించారు. నాగేంద్రనాథ్‌, సీతా దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This