అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీలోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు.బుధవారం ఈ కాల్పులు జరిగినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా,09 మంది గాయపడ్డారు.కాల్పులు జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటికి పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.