Friday, September 20, 2024
spot_img

జీహెచ్ఎంసీలో ఇష్టారాజ్యం.!

Must Read
  • అవినీతి అధికారి అరాచకం
  • డిప్యుటేషన్ మీద వచ్చి ఐదేళ్లుగా అక్కడే మకాం
  • బదిలీ కాకుండా అవినీతి సొమ్ము బుక్కుతున్న పందికొక్కు.!
  • మున్సిపల్ నిబంధనలను ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ..!
  • జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సి.సి.పి ప్రదీప్ కుమార్ పై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం

తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మాములుగా లేవు. జీహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. బండరాయిపై వర్షం పడితే దానికి సిగ్గూ ఎగ్గూ లేకుండా తడుస్తుంది.. ఒంటిమీద రెట్ట పడితే దులిపేసుకుని పోయే మహానుభావులు ఈ సొసైటీలో తిష్టవేసి కూర్చున్నారంటే అతిశయోక్తి కాదు.. ప్రస్తుతం అలాంటి ఒక అధికారి అవినీతి భాగోతం పుంఖాను పుంఖాలుగా రాస్తున్నా తరగడం లేదు.. ఈయన గారి అవినీతి చరిత్ర చూసి అవినీతి అనే పదం కూడా సిగ్గుపడుతోంది.. కళ్ళు బైర్లు కమ్మే ఒక కథనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.. వివరాలు చూస్తే..

ప్రజాస్వామ్యంలో సామాన్యులకు, సంపన్నులకు ఒకటే రూల్ ఉండాలి.. తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షించక తప్పదు అనే నినాదంతో టి.ఎస్.బి పాస్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు దానిలో ఉన్న లోపాలను.. లోపాలను అతిక్రమించి లక్షల కోట్లు దోచుకుంటున్న అవినీతి అధికారులు… జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ స్థాయి అడిషనల్ సి.సి.పి అధికారి అవినీతి లీలలు 8 పొందుపరిచి.. 9, 10 ఇలా పూర్తి ఆధారాలు సేకరించి వార్తలు రాస్తున్నాం.. గత ప్రభుత్వంలో అధికారులు, ప్రభుత్వ పెద్దలకు దోచి పెట్టారనే నెపంతో.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విభాగంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను బదిలీలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఇన్ని బదిలీలు జరుగుతున్నా.. కొందరు అవినీతి అధికారులు తన పలుకుబడితో.. ఏళ్ల కేళ్లు అదే సీట్లో కూర్చొని కోట్లు కొల్లబడుతున్నారు అనడానికి ప్రత్యక్ష సాక్షమే ఈ ప్రదీప్ కుమార్.

అవినీతి ఆధారాలను క్లుప్తంగా పొందుపరిచినా… చర్యలు తీసుకోక పోవడం వెనుక, ఉన్నత అధికారులకు సైతం ఈయన తీసుకునే కమిషన్ లో వాటాలు పైస్థాయి అధికారులకు అందుతున్నాయా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే దృఢ నిశ్చయంతో.. అది కూడా జీహెచ్ఎంసీలో అయితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనే దుర్బుద్ధితో.. ఐదు సంవత్సరాల క్రితం రాజకీయ పలుకుబడితో జీహెచ్ఎంసీ సంస్థలో పోస్టింగ్ వేయించుకొని.. అక్రమ ధనార్జనే ధ్యేయంగా, ఈయన అవినీతికి పాల్పడ్డాడు అనడానికి ఎన్నో ఆధారాలు పొందుపరిచి వార్తలు రాస్తున్నాం.. సామాన్య నిర్మాణదారుడు గానీ బిల్డర్ కానీ.. నిర్మాణం చేపట్టాలి అంటే… అన్నీ డాక్యుమెంట్స్ సవ్యంగా ఉన్నా.. ఫైలు ముట్టుకుంటే మినిమం 10 లక్షల రూపాయలు సార్ గారికి చెల్లించాల్సిందే. చెల్లించలేని సందర్భంలో ఎంత వారు కానీ.. సారు ససేమిరా పని చేయరు.. అదే విధంగా అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన నిర్మాణాలకు 100 తప్పులు ఉన్నా.. లంచం తీసుకొని దొడ్డిదారిన ఫైల్ చేయడం సార్ స్టైల్..!

ప్రదీప్ సార్ మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి 25ఫీట్ల రోడ్డుకు టిడిఆర్ అన్వాయించి, పర్మిషన్ ఇచ్చిన ఫైల్ నెంబర్ పూర్తి ఆధారాలతో మీముందుకు..

ఫైల్ నెంబర్ : 006935 / జీ హెచ్ ఎం సి / 3448 / ఎస్ ఈ సి 2 / 2022 – బీపీ
పర్మిట్ నెంబర్ : 3379 / జీ హెచ్ ఎం సి / ఎస్ ఈ సి / 2022 – బీపీ

జీ.ఓ.ఎం.ఎస్. నెంబర్ : 168 టి.ఎస్.బి. పాస్ చట్టం ప్రకారం.. 25 ఫీట్ల రోడ్డుకు టిడిఆర్ (ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ అన్వాయించబడవు..) రోడ్డు విస్తరణలో ఎవరైనా ఇంటి సముదాయాన్ని, వాణిజ్య భవన సముదాయాన్ని, భూమిని కోల్పోతే మున్సిపల్ నిబంధనల ప్రకారం సదరు నిర్మాణదారునికి, స్థల యాజమానికి నష్టపరిహారంగా టిడిఆర్ ఇవ్వబడుతుంది.. సదరు భూమిని కోల్పోయి టిడిఆర్ పొందిన వ్యక్తి ఆ టిడిఆర్ ని అమ్ముకునే వెసులుబాటును మున్సిపల్ చట్టం కల్పించింది. అంటే ఇక్కడ కోల్పోయిన స్థల సముదాయం టిడిఆర్ ని.. ఎవరైనా వ్యక్తి, నిర్మాణదారుడు 40 ఫీట్ల రోడ్డు ఉండి.. ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ.. తాను నిర్మించే బహుళ అంతస్తులు నిర్మాణానికి టి.డి.ఆర్. స్థల సముదాయాన్ని ఇతరుల నుండి కొనీ, అన్వాయించుకొని లబ్ధిపొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది తెలంగాణ మున్సిపల్ చట్టం. మున్సిపల్ నిబంధనలు దిక్కరించి, అక్రమ పద్ధతిలో, లక్షల్లో డబ్బులు తీసుకుని 25 ఫీట్ల రోడ్డుకు.. అడిషనల్ సిసిపి ప్రదీప్ కుమార్ పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు.. వాటి వివరాలు.. పైన పొందుపరిచాం.

2) ఎవిడెన్స్ నెంబర్ 2:010412 / జీ హెచ్ ఎం సి / 5156 / ఎస్ ఈ సి 1 / 2023 – ఓసీ

006028 / జీ హెచ్ ఎం సి / 3001 / ఎస్ ఈ సి 1 / 2023 – ఓసీ..
004904 / జీ హెచ్ ఎం సి / 2454 / ఎస్ ఈ సి 2 / 2023 – ఓసీ

ఫైర్ అండ్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణానికి ఆకుపెన్సి, ఓసి సర్టిఫికెట్ ఇవ్వకుండా మూడుసార్లు రిజెక్ట్ అయిన ఫైల్ ను అనుమతించిన ఘనత ద గ్రేట్ ప్రదీప్ కుమార్ ది.

అసలే సికింద్రాబాద్ ప్రాంతం.. ఇరుకిరుకు రోడ్లు.. ట్రాఫిక్ సమస్యలు.. ఇటీవలే అగ్ని ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం.. మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వడం.. పర్యవేక్షించకపోవడం.. వేలల్లో అక్రమ నిర్మాణాలు ఏర్పడడం.. వాటికి లక్షల్లో లంచాలు తీసుకొని అక్రమ పద్ధతిలో పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం.. ఈ తతాంగం అంతా పరిపాటిగా మారిపోయింది.

‘ఆదాబ్ హైదరాబాద్’ రీసర్చ్ టీం.. పరిశోధించి మరీ అవినీతిని వెలికితీస్తూ ఉంది.. ఈ అవినీతిపై ఉన్నత స్థాయి కార్యవర్గం, మున్సిపల్ శాఖామాత్యులు, సీఎం రేవంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కట్ట ఐఏఎస్.. వీరంతా ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

టీఎస్ బిపాస్ అక్రమాలపై పూర్తి ఆధారాలతో మరొక కథనంలో మీముందుకు రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This