తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న డీఎస్సి 2024 పరీక్షా గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.జులై 18 నుండి ఆగష్టు 05 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఈ పరీక్షా జరగబోతుంది.మొత్తం 13 రోజులపాటు డీఎస్సి పరీక్షలు జరుగనున్నాయి.తెలంగాణ వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో 56 కేంద్రాల్లో పరీక్షా నిర్వహించునున్నారు.మొత్తంగా రెండు విడతల్లో డీఎస్సి పరీక్షా నిర్వహిస్తున్నారు.ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు తోలి విడత,మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండు విడత పరీక్ష నిర్వహిస్తారు.పీఈటీ,ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ఉదయం 9నుంచి12 గంటల వరకు,మధ్యాహ్నం 2నుంచి5 గంటల వరకు పరీక్షా ఉంటుందని అధికారులు తెలిపారు.ఇప్పటికే 2 లక్షల మంది హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు :
- గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
- గంటన్నర ముందు నుండే పరీక్షా కేంద్రంలోకి అనుమతి
- హాల్ టికెట్,ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసారి
- హ్యాండ్ వాచెస్,ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకీ అనుమతించారు