Thursday, November 21, 2024
spot_img

అక్రమ నిర్మాణదారులకు శ్రీ రామరక్ష

Must Read
  • కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి
  • మూసాపేట్ లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు
  • రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం
  • రెండుసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు
  • బిల్డర్లతో జీహెచ్ఎంసి అధికారులు కుమ్మక్కు
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతున్న అధికారి మహేందర్

రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ పెద్ద పెద్ద బిల్డింగ్ లు కడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు మాముళ్లు ఇస్తూ తమ ఇష్టారీతిన పై అంతస్థులు కడుతున్నా ఎవరూ అడ్డుచెప్పేవారే లేరు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బిల్డర్స్ భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి భవనాలు కట్టడం ద్వారా ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. నాకేం పట్టింది నా జేబు నిండితే చాలు అన్నట్టు గవర్నమెంట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. సిటీ డెవలప్ అవుతున్నా కొద్ది యజమానులకు ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ అధికారుల సపోర్ట్ తో తమకు నచ్చిన రీతిలో భవన నిర్మాణాలు చేపడుతుండడం గమనార్హం.

కూకట్‌ప‌ల్లి సర్కిల్ మూసాపేట పరిధిలోని కైతలాపూర్ మెయిన్ రోడ్డు, ఫేజ్ 15, ఎల్ఐజీ 81 లో నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణం జోరుగా సాగుతుంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి మహేందర్ నే. ఆయన బిల్డర్స్ వద్ద మాముళ్లు తీసుకొని నిర్మాణాలు చేపట్టేందుకు వాళ్లకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఆయనతోపాటు మరి కొందరు జీహెచ్ఎంసి అధికారులు కొందరూ బిల్డర్స్ కు అండదండలుగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మూసాపేట పరిధిలోని కైతలాపూర్ మెయిన్ రోడ్డులో గవర్నమెంట్ నుంచి రెసిడెన్షియల్ (ఇంటి నిర్మాణం) కోసం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ నిబంధనలు తొంగలు తొక్కి దాన్ని కాస్త కమర్షియల్ స్పేస్ నిర్మాణం చేపడుతుండడంతో.. ఆ నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారుల ఆజ్ఞల మేరకు సిబ్బంది తూతూ మంత్రంగా రెండుసార్లు ఈ నిర్మాణాన్ని కూలగొట్టడం జరిగింది.

కుక్క తోక వంకరే అన్నట్టు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నందున కూల్చివేయడం జరిగింది. అయినా ఏ మాత్రం బుద్ధిమారలేదు. పర్మిషన్ లేకున్నా కానీ మళ్లీ అదేవిధంగా నిబంధనలు పట్టించుకోకుండా బిల్డింగ్ నిర్మాణం కొనసాగిస్తున్నారు. నీళ్లు వదులుతూ భవన నిర్మాణం కొనసాగుతుందంటే చట్టాలను అపహాస్యం చేయడంలో ఉద్యోగులు పాత్ర కూడా ఉంది. అందులోను టౌన్ ప్లానింగ్ అధికారి మహేందర్ సహాయ సాకారాలతోనే బిల్డర్ సదరు నిర్మాణాన్ని కొనసాగించినట్టు స్థానికులు వాపోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగుస్తులే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

డబ్బు ఉన్నోళ్ల దగ్గర పైసలకు కక్కుర్తిపడి సర్కారు నిబంధనలు తుంగలో తొక్కేలా వ్యవహారించే అధికారులు.. నగరానికి పొట్టకూటికోసం వచ్చిన సామాన్యులపట్ల కర్కషంగా వ్యవహరిస్తారు. కుటుంబ పోషణకు రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకునే వాళ్లపై ఇదే అధికారులు చూపించే అధికారం జులుం మామూలు స్థాయిలో ఉండదు. ఈ భవన నిర్మాణంలో కేవలం కమర్షియల్ నిర్మాణం అతిక్రమించడమే కాదు. అధికారులు జారీ చేసిన పరిమితికి మించి బహుళ అంత‌స్తులు నిర్మించడంలోనూ యధేచ్ఛగా ఈ బిల్డర్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంలో ముందుడడం హాస్యాస్పదం అన్నారు. ఇటువంటి తప్పుడు నిర్మాణాలతో ఒక ప్రక్కన ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుండగా జాబ్ చేస్తూ.. ఉద్యోగులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా అక్రమాలకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు ఆదాయం కోసం అధికారులు అర్రులు చాచడమే ఇటువంటి అక్రమ నిర్మాణాలకు వెన్నుదన్నుగా ఉండడానికి కారణంగా ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారి పూర్తి సహకారంతో చోటు చేసుకుంటున్న ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, అవినీతికి పాల్పడుతున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS