రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాఖలు చేసిన పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 18న కేటీఆర్ తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. బాల్క సుమన్, సత్యవతి రథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లను కోర్టు రికార్డు చేయనుంది.