Thursday, January 30, 2025
spot_img

లంచం ఇచ్చుకో.. భూములు పుచ్చుకో..

Must Read
  • జీఓ నెం.59కు తూట్లు.. ప్రభుత్వ అధికారులే కారకులు
  • ముఖ్య‌పాత్ర పోషించిన త‌హ‌సీల్దార్ ఎం.వి న‌ర్సింహారెడ్డి
  • అక్రమ మార్గంలో పట్టాచేసిన వైనం
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధికారుల అలసత్వం
  • కోట్లాది రూపాయల విలువైన ప్ర‌భుత్వ భూమి స్వాహా
  • ఉప్పల్ కల్సా గ్రామంలో 1050 గజాల భూమి ఖతం
  • సర్కారు జీఓ, నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం
  • గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం
  • ఎప్పటి నుంచో అక్కడ్నే ఉంటున్నట్టు కలరింగ్
  • అక్ర‌మంగా విద్యుత్ కనెక్షన్ ఇప్పించిన అధికారులు
  • భారీగా ముడుపులు తీసుకున్నట్టు అనుమానాలు

హైదరాబాద్ లో కబ్జాల పర్వం పెచ్చుమీరిపోయింది. ప్రభుత్వ భూములను కొందరు కబ్జా పెడుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే జాగలను పొతం పెడుతున్నారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగమే లంచం ఇచ్చుకో… ప్రభుత్వ భూములు పుచ్చుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా అక్రమాలకు అడ్డగా మారిపోయింది. మరింత కాస్లీ భూములు ఉన్న ఈ జిల్లా పరిధిలో అక్రమార్కుల ఆగడాలకు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ బలంతో, అధికారుల సఫోర్ట్ ఫుల్లుగా ఉండడంతో కబ్జాకోరులకు అడ్డేలేదు. మేడ్చల్ జిల్లా ఉప్ప‌ల్ మండ‌లం, గ్రామం కల్సాలో కోట్లాది రూపాయల విలువైన భూములను చెరబట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం జీఓ నెం. 58, 59ను తీసుకొచ్చింది. ఎంతో కాలం నుంచి గవర్నమెంట్ ల్యాండ్ లో చిన్న చిన్న ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి రెగ్యూలరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. జీఓ నెం. 59 జారీ చేస్తూ కొన్ని నియమ నిబంధనలు జారీ చేసింది ప్రభుత్వం. కానీ, సర్కారు విధించిన కండిషన్స్ ను ఎవరికి నచ్చినట్టు వారు మార్చుకున్నారు. అవినీతి అధికారుల పనితనం ఇక్కడ బాగా పనిచేస్తుంది. “పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు” అన్నట్టు తయారైంది ప్రభుత్వ అధికారుల తీరు. మాముళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు అన్ని విధాలా సహకరిస్తున్నారు.

ఉప్పల్ మండలం అప్ప‌టి త‌హ‌సీల్దార్ ఎం.వి. న‌ర్సింహారెడ్డి ప్రభుత్వ భూమిని అప్పగించడంలో తనదైన పనితనం చూపించారు. అయితే అప్పటి ప్ర‌భుత్వం జారీచేసిన జీఓ నెం.59 ‌నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా భారీగా ముడుపులు తీసుకున్నారు. స‌ర్వే నెం. 789/1 ఉప్ప‌ల్ కల్సా హైకోర్టు కాల‌నీ స‌మీపంలో కొత్త‌ప‌ల్లి ల‌చ్చ‌మ్మ‌కు అప్లికేష‌న్ నెం. AOG022200240130, డాక్యుమెంట్ నెం.15876/2023 తేదీ అక్టోబర్ 6, 2023న 500 గ‌జాలకు గాను రూ.67,45,000లు, అదేవిధంగా కె.ల‌క్ష్మి AOG022200240807, డాక్యుమెంట్ నెం. 15877/2023 తేదీ అక్టోబర్ 6, 2023న 550 గ‌జాలకు రూ.76,32,500లు వసూలు చేశారు. వీళ్లిద్దరిదీ క‌లిపి మొత్తం 1,050 గ‌జాల‌కు గాను రూ. 1,43,77,500లు క‌ట్టించుకోని ఉప్ప‌ల్ కల్సాలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నర్సింహారెడ్డి అప్పనంగా అప్పగించేశారు. గతంలో ఎమ్మార్వోగా ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ను ఖతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్ర‌స్తుతం ఉప్ప‌ల్ కల్సాలో గ‌జం సుమారు రూ. ల‌క్షకు పైమాటే అంటే అర్థం చేసుకోవాలి. దాదాపు రూ.10,50,00,000లు పలుకుతుంది. దీని ద్వారా ప్ర‌భుత్వానికి సుమారు రూ. 9కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింది. ఈ వ్య‌వ‌హారాన్ని అప్ప‌టి త‌హ‌సీల్దార్లు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను బేఖాత‌రు చేస్తూ జీఓ 59 కింద ప‌ట్టాలు చేయ‌డం గమనార్హం. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ప్ర‌భుత్వ భూమిలో గ‌త కొన్ని ఏళ్ల నుండి నివాసం ఉంటున్న‌ వారికి సొంతం చేయాలన్నది. అందులో జీవో 59 నిబంధ‌న‌ల‌కు లోబ‌డి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి వారికి ప‌ట్టా చేయాల‌ని ప్రభుత్వ ఆదేశాలు క్లీయర్ గా ఉన్నాయి. కానీ కొంద‌రు అధికారులు డబ్బు ఆశతో స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం అవినీతి పాల్పడ్డారు. వారికి ఉచిత స‌ల‌హాలు ఇచ్చి, రాత్రికిరాత్రి ఒక గ‌దిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఎంతో కాలంగా అక్కడే ఉంటున్న‌ట్లు ఏర్పాట్లు కూడా చేశారు. అధికారులు క‌ల‌రింగ్ ఇస్తూ ట్రాన్స్ కో అధికారుల‌ను బురిడీ కొట్టించారు. తద్వారా అక్కడ వెంటనే విద్యుత్ క‌నెక్ష‌న్లు కూడా ఇప్పించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచి, బ‌డాబాబుల‌తో కుమ్మ‌క్కై ఆఫీసర్లు రూ.కోట్ల‌ల్లో లంచం పుచ్చుకున్నారు. “నాది కాదు నా అత్త గారు సొమ్ము అన్నట్టుగా” కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల‌ను అప్ప‌నంగా అప్ప‌గించేశారు. నేటికి ఈ భూమి ఖాళీగా ఉండి.. అదేవిధంగా వాట‌ర్ క‌నెక్ష‌న్ కూడా లేకుండా ఉండ‌డం గ‌మ‌నార్హం..

కోట్ల రూపాయల గవర్నమెంట్ భూములు ఖతం కావడంపై ఇకనైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా క‌లెక్ట‌ర్ చొరవ తీసుకోవాలి. ఎలాగైనా కబ్జాకోరుల చేతులో పడ్డ ప్రభుత్వ భూమిని రక్షించాలి. దీనిపై స్పందించి వెంట‌నే ఈ ప‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలి. సర్కారు భూమిని కొట్టేసేందుకు సహకరించిన అవినీతి అధికారుల‌ను విధుల నుండి తొల‌గించి వారిపై చట్టరిత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక ప్ర‌జ‌లు కోరుతున్నారు.

ప్ర‌జాసంక్షేమం కొర‌కు ఎన్నుకున్న కార్పొరేట‌ర్‌.. ఆ కార్పొరేట‌ర్‌ ప్ర‌జ‌లు ఇచ్చిన ఆ ప‌ద‌విని అడ్డుపెట్టుకొని ఏ విధంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాడో పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం..

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS