ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.జగన్ కి కోడి కత్తి కేసులో ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు.2019లో జగన్ పై దాడి జరిగిందని,05 ఏళ్ళైనా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కి రాలేదని గుర్తుచేశారు.అప్పుడంటే బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కి కుదర్లేదు,ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టి అమాయుకుడైన జగన్ కి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.