శ్వేధం చిందించి బాహుజనులు బాహుపన్నులు కడితే..
కట్టిన పైకంతో పాలనా చేసే పాలకులారా..
రాజ్యంలో అత్యధికముగా ఉన్న బీసీలకు అన్నిటిలో వాటా ఎందుకు ఇవ్వరు..
కుల వృత్తి చేసి కడుపునింపుకునే కూలీలమే కానీ..
మీరు కూర్చునే కుర్చీ నుండి పడుకునే మంచం దాక మావే..
హక్కులు అందకుంటే అణిగింది చాలు..
భరిగిసి కొట్లాడే బాహుజనులం
భారీగా బలమై బలగమై వస్తున్నాం..
ఆలోచన చెయ్యండి అన్నింట్లో
మా వాటా మాకు ఇవ్వండి..
- సుమన్ గౌడ్