Friday, September 20, 2024
spot_img

తిరిగి జైలుకు వెళ్తున్న..ఇంకా ఎన్ని రోజులుపాటు బందిస్తారో తెలియదు

Must Read
  • భావోద్వేగానికి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
  • జైలులో ఉన్నప్పుడు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టరు
  • గత 20 ఏళ్ల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న
  • జైల్లో మందులు కూడా ఇవ్వడం లేదు
  • జూన్ 02 న తిరిగి తిహార్ జైలుకు , భావోద్వేగంతో వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదురుకుంటున్న కేజ్రీవాల్ ఇటీవలే ఎన్నికల ప్రచారం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కేజ్రీవాల్ కు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. తిరిగి జూన్ 02న తీహార్ జైలుకు వెళ్తుండడంతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన గడువు జూన్ 01తో ముగిసిపోతుంది, జూన్ 02న తిరిగి తీహార్ జైలుకు వెళ్తున్న అని తెలిపారు. తిరిగి మళ్ళి జైలుకు వెళ్తున్న నన్ను ఇంకా ఎన్ని రోజులు బందిస్తారో తెలియదని , జైలులో ఉన్నప్పుడు తనను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.జైలులో తనకు సరిగ్గా మందులు కూడా ఇవ్వడంలేదని , గత 20 సంవత్సరాల నుండి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు.జైలులో తనకు మందులు కూడా ఇవ్వడం ఆపేశారంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జైలుకు వెళ్లిన తర్వాత తన బరువు 70 కేజీల నుండి 64కు చేరుకుందని అన్నారు.ఇదిలా ఉంటె తన బెయిల్ ను పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది.కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు స్వీకరించలేదు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This