- దసరా పండుగ కంటే ముందే కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు,ఉద్యోగులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ ప్రకటించారు.2023-2024 ఏడాదిలో సింగరేణి సంస్థ నుండి 4 వేల 701 కోట్ల లాభం వచ్చిందని,ఇందులో 2 వేల 289కోట్లు సింగరేణి విస్తరణకు పెట్టుబడిగా పెట్టమని,796 కోట్ల లాభాలను కార్మికులకు పంచుతామని తెలిపారు.దసరా పండుగ కంటే ముందు కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తుందని,ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించమని పేర్కొన్నారు.సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి తలమానికమని,సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.రూ.796 కోట్లు కార్మికులకు,ఉద్యోగులకు బోనస్ రూపంలో అందజేస్తామని వెల్లడించారు.ఒక్కో కార్మికుడికి రూ.లక్ష 90 వేలు అందజేస్తామని పేర్కొన్నారు.