Thursday, November 21, 2024
spot_img

అమీన్ పూర్ లో స‌ర్కార్ భూమి ఆక్రమణ

Must Read
  • అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి
  • రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు
  • సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్
  • సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం
  • కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్య‌క్తులు
  • ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు
  • దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా ఆస్పత్రి నిర్మించాలని ప్రజల డిమాండ్

తెలంగాణలో భూముల విలువ పెరిగిన కొద్దీ ఆక్రమణదారులు పెరిగిపోతున్నరు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఏ మారుమూల గ్రామంలో చూసిన భూమి వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ఒక ఎకరం భూమి సుమారు 50లక్షలకు తక్కువ లేదంటే అతిశయోక్తి కాదు. రియల్ ఎస్టేట్ దందా పెరిగి రేట్లను అమాంతం పెంచేశారు. ఇక ప్లాట్ల ధరలు గురించి మాట్లాడే తరికలేదు. ఈ నేపథ్యంలో కొందరూ అన్నం తినుడు మానేసి భూములను, వాటి ద్వారా వచ్చే డబ్బులను తింటున్నారు. భూములు, జాగలు కొట్టేయడం వాటిని విక్రయించడంపైనే దృష్టిపెడుతున్నారు. అక్రమార్కులు… ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్లు, గుట్టలు, పుట్టలు, చెట్లు, చేమలు, చెరువులు, కుంటలు దేన్ని వదలడం లేదు. దేన్నైనా ఏదో ఓ విధంగా ఆక్రమించుకోవాలనే తపనతో ఉంటున్నారు. తద్వారా రియల్టర్లు.. రాజకీయ, అధికార పలుకుబడితో భూములను కాజేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా మాముళ్లకు ఆశపడి ప్రభుత్వ భూములు, అమాయకుల జాగలను అక్రమార్కులకు అప్పగించేస్తున్నారు. సర్పంచ్ నుంచి మొదలు ఉన్న‌తాధికారుల వరకు ఎవరికీ వాళ్లూ తోచినకాడికి భూములను కబ్జా చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే ఇలాంటివి బాగానే చోటుచేసుకున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ లోనూ ఇదే కంటిన్యూ అవుతున్నది. గవర్నమెంట్ భూములు, ఆస్తులను కాపాడాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం కూడా అదే పని చేయడం శోచనీయం. లక్షలాది రూపాయల వేతనం తీసుకునే ఆఫీసర్లు, ఉన్నతాధికారులు సైతం ఇలాంటివి ప్రోత్సహించడంతో తెలంగాణలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి.

కొంద‌రు వ్య‌క్తులు గవర్నమెంట్ ల్యాండ్లను కొట్టేస్తున్నారు. ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులు అవినీతిలో కూరుకుపోయి అక్రమార్కులు వద్ద లంచాలు తీసుకుంటూ వాళ్లకు అంటకాగుతున్నారు. లక్ష‌ల్లో మాముళ్లు అందుకొని భూములు రిజిస్ట్రేషన్లు చేపిస్తూ, అక్రమ నిర్మాణాలకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వార్తలు రాస్తూ ఇలాంటి అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన కొంద‌రు వ్య‌క్తులు తమ వృత్తికి అన్యాయం చేస్తున్నారు. కొంద‌రు వ్య‌క్తులు త‌న ఉన్న‌త‌స్థానం పేరు చెప్పుకుంటూ ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. అక్రమ మార్గంలో జాగలను కొట్టేయాలనే దుర్భుద్దితో బయట తిరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం, మండలం పరిధిలోని సర్వే నెం.462లో కోట్లాది విలువ చేసే 3ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిలో నుంచి 22 గుంటల స్థలాన్ని విద్యుత్ సబ్ స్టేషన్ కొరకు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం స్వాతంత్య్రోధ్య‌మ‌కారుడి కొడుకుకు 300 గ‌జాల స్థ‌లాన్ని కేటాయించార‌ని తెలుస్తుంది.. అదేవిధంగా 8మంది పాత్రికేయుల‌కు 120 గ‌జాల చొప్పున స్థ‌లాన్ని కేటాయించార‌ని, రోడ్డు విస్త‌ర‌ణ కొర‌కు కొంత స్థ‌లం పోగా మిగిలిన సుమారు 1 ఎక‌రం స్థ‌లం ప‌క్క‌న 461,383 స‌ర్వె నెంబ‌ర్ గ‌ల ప‌ట్ట‌దారులు కొంత ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేశార‌ని తెలుస్తుంది. విలేక‌రుల‌కు, స్వాతంత్య్రోధ్య‌మ‌కారుడి కొడుకుకు ఇచ్చిన స్థ‌లం అనంత‌రం మిగులు భూమిలో ప్ర‌జాసంక్షేమానికైన లేదా స్థానిక విలేక‌రుల‌కైన కేటాయిస్తే బాగుండేద‌ని స్థానిక ప్ర‌జ‌లు కోరుతున్నారు.. ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే విలేక‌రుల‌కు, స్వాతంత్య్రోధ్య‌మ‌కారుడి కొడుకుకు, రోడ్డు విస్త‌ర‌ణ‌, స‌బ్ స్టేష‌న్ ల‌కు భూ కేటాయింపు జ‌రిగితే ఆ విస్తీర్ణం పోను మిగులు భూమిని ప్ర‌భుత్వ రికార్డులో న‌మోదు చేయాలి.. కానీ ఈ రోజు వ‌ర‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో స‌ర్వే నెంబ‌ర్ 462లో ప్ర‌భుత్వ భూమి 3 ఎక‌రాలుగా చూపించ‌డం జ‌రుగుతుంది. మ‌రీ ఈ కేటాయింపులో స్వాతంత్య్రోధ్య‌మ‌కారుడి కొడుకుకు, విలేక‌రుల‌కు స్థ‌లాన్ని కేటాయించిన‌ప్పుడు వారి పేర్లు ధ‌ర‌ణి రికార్డులో ఎందుకు న‌మోదు చేయ‌లేదు..

100 పడకల ఆస్పత్రి నిర్మించాలి:

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం, మండలం పరిధిలోని సర్వే నెం.462లో కబ్జాకు గురైన 1 ఎకరం 30 గుంటల భూమిని రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గజం సుమారుగా లక్ష, రెండు లక్షల రూపాయల విలువైన సర్కారు భూమిని కాపాడి, అక్కడ 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమీన్ పూర్ మండలంలోని ప్రజలకు వైద్యసేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదే విష‌యంపై స‌ర్వే నెంబ‌ర్ 462లో విలేక‌రుల‌కు, స్వాతంత్య్రోధ్య‌మ‌కారుడి కొడుకుకు, స‌బ్ స్టేష‌న్‌కు, రోడ్డు విస్త‌ర‌ణ‌కు కేటాయించిన భూమి వివ‌రాల‌పై డిప్యూటీ త‌హ‌సిల్దార్‌కు వివ‌ర‌ణ కోర‌డం జ‌రిగింది. వాటికి సంబంధించిన ప్రోసిడింగ్స్ ప‌త్రాలు ఇవ్వాల్సిందిగా కోర‌డం జ‌రిగింది. కానీ, డిప్యూటీ త‌హ‌సిల్దార్ స్పందించ‌లేదు..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS