- కేటగిరి ఏదైనా తగ్గేదే లే..!
- ఎజెంట్లతో అడ్డగోలు దోపిడి
- స్క్వేర్ ఫీట్లలో గోల్‌మాల్
- రహదారి మార్పులతో డ్రామాలు
- స్వంత డిపార్ట్‌మెంట్‌ను వదిలి.. మరీ సర్కిల్-6లో 3 ఏళ్ల పాటు తిష్ట
- పాశం గోవిందారెడ్డి చిత్ర, విచిత్రాలు..!
- సమగ్ర విచారణ చేస్తే గోవిందా రెడ్డి భాగోతాలన్నీ బట్టబయలయ్యే ఛాన్స్
దండుకోవాలనే ఆలోచన ఉన్నోడికి రూల్స్‌తో పనేముంటుంది. ఉన్నతాధికారులు, పైఅధికారుల మద్దతుంటే చాలు యధేచ్చగా రెచ్చిపోవచ్చు. అడ్డగోలుగా సంపాదించుకోవచ్చు. అందికాడికి దోచుకోవచ్చు. అడిగేనాథుడు లేకపోతే చాలు ఉద్యోగం వెలగబెట్టినన్ని రోజులు కోట్ల రూపాయాలు పొగేసుకోవచ్చు. నిబంధనలకు పాతరేసి జేబులు నింపుకోవచ్చు. సరిగ్గా ఇదే పని కానిచ్చేశారు మలక్‌పేట్ సర్కిల్-6లో శానిటరీ అసిస్టెంట్ లైసెన్ అధికారిగా 3 ఏళ్ల పాటు ఉద్యోగం వెలగబెట్టిన మన పాశం గోవిందారెడ్డి. ఆయన దోపిడి గురించి అడిగే నాథుడే లేకపోవడంతో.. అంబోతు గడ్డివాము మీద పడి అడ్డగోలుగా తినేసినట్లు దోపిడికి తెర లేపిండు. ముగ్గురు తాబేదార్లను పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్‌ల రీ వెరిఫికేషన్ పేరుతో వీలైనంత ఎక్కవుగా వసూళ్లకు పాల్పడ్డారు.
జీహెచ్ఎంసీ, ఆయా సర్కిళ్ల పరిధిలో ట్రేడ్ లైసెన్స్‌లు పొందాలనుకుంటే మొదటగా మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత సదరు షాపులు,హోటల్స్, కాంప్లెక్స్‌ల యాజమానులకు ట్రేడ్ లైసెన్స్ వస్తుంటాయి. అయితే ఇలా మీ సేవా ద్వారా లైసెన్స్ పొందిన వారిలో ఎవరైనా నిబంధలను పాటించలేదని తేలితే.. ట్రేడ్ లైసెన్స్‌ల రీ వెరిఫికేషన్‌కు అవకాశముంటుంది. ఈ రీ వెరిఫికేషన్ అనేది ఆయా షాపులు, హోటల్స్, కమర్షియల్ కాంపెక్స్‌ల విస్తీర్ణం, అవి ఏ రహదారి పక్కనున్నాయి అనే అంశాలపై వాటికి చలాన్లను రాయాల్సి ఉంటుంది. చలాన్ల మొత్తాన్ని బట్టి అధికారులు చలాన్లు రాస్తుంటారు. ట్రేడ్ లైసెన్స్ కింద తినుబండారాలు, మెడికల్ ఎస్టాబిష్మ్‌మెంట్, నాన్ ఈటింగ్, నాన్ మెడికల్ ఎస్టాబిష్మ్ మెంట్ వంటి అంశాలు వస్తాయి. తినుబండారాల కిందకు రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్, బేకరీలు వంటివి వస్తాయి. ఇక
మెడికల్ ఎస్టాబిష్మ్ మెంట్ కిందకు క్లినిక్స్, నర్సింగ్, హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ తదితర అంశాలు ఉంటాయి.
తినుబండారాలు, మెడికల్ ఎస్టాబిష్మ్ మెంట్స్ వంటి వాటికి ఫీల్డ్ ఇన్స్ పెక్షన్ చేసే అధికారం ఆయా సర్కిళ్ల పరిధిలోని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ కు ఉంటుంది. వీళ్లే క్షేతస్థాయి పరిస్థితిని పరిశీలించి ఆ నివేదికను సర్కిల్‌లోని డిప్యూటీ కమిషనర్ కు పంపిస్తే అప్రూవల్ అథారిటీగా సంతకం పెడితే ఫైల్ క్లోజ్ అవుతుంది. మరోవైపు నాన్ ఈటింగ్ అండ్ నాన్ మెడికల్ ఎస్టాబిష్ మెంట్ విభాగం కూడా ఆయా సర్కిళ్ల లిమిట్స్‌లోనే ఉంటుంది. దీనికి కూడా క్షేత్రస్థాయి ప్రత్యేక లైసెన్స్ అధికారి ఉంటారు. దీనికి మాత్రం అప్రూవల్ అథారిటీ జోనల్ కమిషనర్ ఫైనల్ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. క్యాటగిరి-3 కిందకు పీట్టి ట్రేడ్స్ వస్తాయి. చిన్నపాటి వస్తువులు అమ్ముకునే వారు, చిరువ్యాపార దుకాణాదారులు దీనికి కిందకు వస్తారు. దీనికి కూడా క్షేత్రస్థాయి పరిశీలకుడిగా అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ ఉంటారు. కేటగిరి-4లోకి మాంసం, చికెన్, అమ్మే షాపులు వస్తాయి. అయితే వీటికి వెటర్నరి అధికారి ఫీల్డ్ ఆఫీసర్‌గాను చీఫ్ వెటర్నరీ అధికారి అప్రూవల్ అథారిటీగానూ ఉంటారు.
స్క్వేర్ ఫీట్ల లెక్కలివి..
అయితే షాపుల స్వ్కేర్ ఫీట్ల విస్తీర్ణం.. ఆ షాపు, కమర్షియల్ భవనం, కాంప్లెక్స్ ముందున్న వెడల్పైన రహదారులను బట్టి రీ వెరిఫికేషన్‌లో ట్రేడ్ లైసెన్స్ చలాన్లను సర్కిళ్ల పరిధిలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ అధికారులు రాస్తారు. 20 ఫీట్ల వెడల్పు రహదారి ఉన్న గల్లీలో షాప్ ఉంటే ఒక్క స్వ్కేర్ ఫీట్‌కు ప్రతీ సంవత్సరానికి 3 రూపాయాల చొప్పున లైసెన్స్ సర్టిఫికేట్ కోసం ఛార్జ్ చేస్తారు. ఇది మాగ్జిమం రూ.10 వేల అమౌంట్ వరకు లెక్కలోకి తీసుకుంటారు. డబుల్ లైన్ లేదా 30 ఫీట్ల రహదారి ఉంటే స్వ్కేర్ ఫీట్‌కు రూ.4 చొప్పున వసూల్ చేస్తారు. మాగ్జిమం రూ.50 వేల వరకూ లెక్కలోకి తీసుకుంటారు. మల్టీపుల్ లైన్ రహదారులు అయితే స్క్వైర్ ఫీట్‌కు రూ.6 చొప్పున తీసుకుంటారు. మాగ్జిమం రూ.2 లక్షల వరకు వసూలు చేస్తారు. స్టార్ హోటల్స్, కార్పొరేట్ ఆసుపత్రులు అయితే ప్రతీ స్వేర్ ఫీట్‌కు రూ.6 చొప్పున లేదా మాగ్జిమం రూ.2.50 లక్షల వరకూ వసూలు చేసి దృవీకరణ పత్రాలు ఇస్తారు. రీవెరిఫికేషన్ కోసం లైసెన్స్ ఫీజును చెల్లించిన వారికి చలాన్ రూపంలో రశీదు ఇస్తారు. వీటిలోకి జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చలాన్లు కూడా వీళ్ళ పరిధిలోకి వస్తుంది.. వీటిలో ఒరిజినల్‌ను సదరు షాపుల యాజమానులు ఇవ్వగా, డ్యూబ్లికేట్, ట్రిబ్లికేట్‌లను మాత్రం సర్కిల్ కార్యాలయంలోని రికార్డు గదులలో భద్రపరచాల్సి ఉంటుంది.
చలాన్ల దొంగ లెక్కలతో రూ.కోట్లు దండుకున్న పాశం గోవిందా రెడ్డి
అయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి మలక్‌పేట్ సర్కిల్-6కు డిప్యూటేషన్‌పై శానిటరీ సూపర్ వైజర్‌గా వచ్చిన పాశం గోవిందారెడ్డి దోపిడీలో తన మార్క్‌ను చూపించారు. సర్కిల్-6 శానిటేషన్ విభాగంలో ఇంఛార్జ్ అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్ గోవింద రెడ్డి ఇక్కడ 3 సంవత్సరాల పాటు పనిచేశారు. ఈ మూడేళ్లలోనే తప్పుడు చలాన్లతో కోట్లు వసూళ్లు చేసేశారు. వాస్తవానికి చలాన్లు రాసేటప్పుడు కేటగిరిల వారీగా ఎంత మొత్తం రాస్తున్నారో.. ఆ మొత్తమే ఒరిజినల్, డ్యూబ్లికేట్, ట్రిబ్లికేట్‌పై ఉండాలి. ఇందుకోసం ఒరిజినల్ చలాన్ రాసేటప్పుడే డ్యుబ్లికేట్, ట్రిబ్యుకేట్ మీద కార్బన్ పేపర్ పెట్టాల్సి ఉంటుంది. అయితే సర్కిల్-6లో అసిస్టెంట్ లైసెన్ ఆఫీసర్ అండ్ ఇంఛార్జ్ అధికారిగా ఉన్న గోవిందా రెడ్డి ఎక్కడా కార్బన్ పేపర్‌ను ఉపయోగించకపోవడం గమనార్హం. చలాన్ కట్టిన యాజమానులకు సరైన మొత్తాన్నే రాసిచ్చి వారి నుంచి ఈ మొత్తం అమౌంట్‌ను తీసుకొని.. కార్యాలయ రికార్డు గదిలో ఉంచాల్సిన డ్యుబ్లికేట్, ట్రిబ్లికేట్ పేపర్ల మీద మాత్రం చాలా తక్కువ అమౌంట్‌ను తర్వాత కార్బన్ పేపర్ పెట్టి రాసి ఇచ్చేవారు. తద్వారా గోవిందారెడ్డి ఇలా ప్రతీరోజు చలాన్ల ద్వారానే దాదాపు రూ.20 నుంచి 40 వేల వరకూ తన మూడేళ్ల పదవీ కాలంలో నొక్కేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సర్కిల్ పరిధిలో వసూళ్ల ఎజెంట్లను పెట్టుకొని భారీ ఎత్తున వసూళ్లు చేశారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రుద్రాదేవేందర్, కామాటి కె.రాము, శానిటరీ జవాన్ కె.యాదయ్యల ద్వారా గోవిందారెడ్డి వసూళ్లు చేయించేవారు. మొత్తంగా పాశం తన మూడేళ్ల పదవీ కాలంలో మలక్‌పేట్ సర్కిల్-6ను మొత్తం దున్నేయడం గమనార్హం. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయించగల్గితే సర్కిల్-6లో మన పాశం గోవిందా రెడ్డి చేసిన కోట్ల స్కాం బయటపడే అవకాశాలు భారీగా ఉన్నాయి..
పాశం గోవిందారెడ్డి అక్రమ వసూల్లపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదు.. వారితో జరిగిన చీకటి ఒప్పందాలపై, ముసారంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, గడ్డిఅన్నారం, శాలీవాహన నగర్ పరిధిలోని హోటల్స్‌కు ట్రేడ్ లైసెన్స్ జారీ చేయకుండా, జారీ చేసి అక్రమంగా వసూలు చేసిన వ్యవహారం, సఫాయి కార్మికుల జాడుకట్టలు, లైన్ పౌడర్, బీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, రేకులు, గంపలు అందించకుండా నిధులు కాజేసిన వ్యవహారంపై మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం. అవినీతిపై అస్త్రం…