Thursday, April 3, 2025
spot_img

పేట్లబుర్జు పోలీస్ గ్రౌండ్స్‎ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Must Read

దసరా నవరాత్రులకు హైదరాబాద్‎లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు.

శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ పేట్లబుర్జ్‎లోని పోలీస్ గ్రౌండ్స్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ పోలీస్‎కు సంబంధించిన సుమారు 800 మంది మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

వివిధ రకాల బతుకమ్మలను ఒక దగ్గరికి చేర్చి, బతుకమ్మ పాటలను పాడుతూ సంప్రదాయాన్ని చాటారు. ఈ సంధర్బంగా సీపీ సీవీ ఆనంద్ ఉద్యోగులందరికి బతుకమ్మ, దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి , సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహర , సైబర్ క్రైమ్ అండ్ ఉమెన్స్ సేఫ్టీ డీసీపీ కవిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS