Thursday, February 20, 2025
spot_img

ఓర్రకుంటలో గ్రేటర్ ఇన్ఫ్రా విల్లాలు..

Must Read
  • మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం నచ్చిన చోట విల్లాలు నిర్మిస్తాం..
  • విస్తుపోయేలా చేస్తున్న ఒర్రకుంటలో కాస్ట్ విల్లాలు..
  • సూపర్ స్కెచ్ వేసి కుంటను మింగేసిన దుర్మార్గం..
  • చూస్తుండగానే చెరువు చటుక్కున మాయం..
  • కుంటను బలిచేసిన కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు
  • అక్కడ చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ..
  • కబ్జాకోరులకు తమవంతు సహాయం అందిస్తున్న రెవెన్యూ శాఖ..
  • హెచ్.ఎం.డీ.ఏ. లేక్స్ లో స్పష్టంగా కుంట..
  • చిత్రంగా అదే హెచ్ఎండీఏ నుంచి నిర్మాణ అనుమతులు..
  • మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటున్న గ్రేటర్ ఇన్ఫ్రా కంపెనీ..
  • ‘హైడ్రా’ బుల్డోజర్ల కోసం ఎదురుచూస్తున్న ఓర్రకుంట..
  • హెచ్ఎండిఏ లైక్స్ లో తిరిగి తన స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు..

భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం మన పూర్వీకులు చెరువులను, కుంటలను నిర్మించింది.. అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అని వారు ఎంతో ముందు చూపుతో చెరువులు, కుంటలను అభివృద్ధి చేశారు.. భూమిలో నీటి వనరులు తగ్గుముఖం పట్టకుండా.. వాన నీటిని చెరువుల్లో, కుంటల్లో నిల్వవుండేలా చూసుకున్నారు.. దీనితో ఆ పరిసర ప్రాంతాల్లో పచ్చడం వెల్లివిరిసే, ప్రకృతి అలరారుతుంది.. దీనితో ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా వుంటుండేది.. కానీ కొందరు ముష్కరులు భూమినే కాకుండా చెరువులను, కుంటలను కూడా తెగమింగేసి భవిష్యత్ తరాలకు, ఈ భూమికి పెను ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు,,

సంగారెడ్డి జిల్లాలో ఒక దుర్మార్గపు ఘటన వెలుగు చూసింది.. వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నెలకొనివున్న ఒర్రకుంట కనుమరుగైపోయింది.. హెచ్ఎండీఏ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 82లో 2.871 ఎకరాలలో ఒర్ర కుంట విస్తరించి ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.. కాగా 2017 ఫిబ్రవరి నెలలో హెచ్ఎండిఏ. ఆధ్వర్యంలో ఈ కుంట విస్తీర్ణానికి సంబంధించి సర్వే నిర్వహించి, ఈ కుంట (ఐడీ-1000/89) హద్దులను కూడా నిర్ణయించడం జరిగింది.. కానీ దురదృష్టం ఏమిటంటే 2017 సంవత్సరంలో హెచ్ఎండీ అధికారులు సర్వే చేసి నిర్దారించిన ఈ కుంటపై కన్నేసిన కొందరు ముష్కర నిర్మాణదారులు కుంటను అడ్డంగా కబ్జా చేశారు. కుంట కబ్జా విషయంలో కదిలిన నీటి పారుదల శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహిం చి కుంటను నిర్ధారించారు. అయితే కబ్జా చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలోనే కుంట ఉందని ఖచ్చితంగా నిర్ధారిస్తూ అప్పటి సంగారెడ్డి నీటిపారుదల శాఖ సూపరింటెం డెంట్ ఇంజనీర్ మురళీధర్ 18 మే. 2023 లో జిల్లా కలెక్టర్ కు సైతం తమ నివేదికను పంపారు. గూగుల్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సహాయంతో కుంట ప్రదేశాన్ని నిర్ధారించడం జరిగింది..

సాక్షాత్తు ఇరిగేషన్ అధికారులు ఆ ప్రదేశంలో కుంట ఉందని పక్కాగా నిర్ధారించినా నిర్మాణ విషయంలో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేశారు. నిర్మాణ సంస్థ అయిన గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రమోటర్లు అప్పటి ప్రభుత్వంలో పక్క జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది.. ఇక ఈ కుంట ఆక్రమణలపై బొల్లారం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా… పత్రికల్లో కథనాలు వచ్చినా వారు బెదరలేదు.. మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరన్న బరితెగింపుతో కుంటలో నిర్మాణాలను యధావిధిగా కొనసాగించారు. ఈ కంపెనీ యాజమాన్యానికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి జిల్లా రెవెన్యూ అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకుని మాయ చేసి, డబ్బుతో మంత్రమేసి తమకు అను కూలంగా సర్వే రిపోర్ట్ ను మార్చుకున్నారు. ఆ తప్పు డు సర్వే రిపోర్ట్ సహాయంతో హెచ్ఎండీ అధికారులను ఎదో ఒక రకంగా ప్రసన్నం చేసుకొని నిర్మాణ అనుమతులను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.. హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో మమ్మల్ని ఎవరేం చేయలేరని విర్రవీగుతూ తమ ఇష్టారితిగా కుంటను కబ్జా చేసి కాస్ట్ విల్లాలను ని ర్మిస్తున్నారు. ఒకప్పుడు నీటితో కళకళలాడిన ఆ కుంటను కాంక్రీట్ జంగల్ గా మార్చి కుంట ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు..

చెరువులు, కుంటలు, వరద కాలువలను ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రకృతి సంపదను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘హైడ్రా’ ఓర్రకుంటను పునరుద్ధరిస్తుందని ఆశలను కలిగిస్తోంది.. ఇక హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ చెరువులోని అక్రమ కట్టడాలపై విచారణ జరిపి కఠినంగా వ్యవహరిస్తూ.. కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇప్పటికే మహానగరంలో పలుచోట్ల అక్రమ కట్టడాలపై కొరడా జూలూపించిన “హైడ్రా’ బృందం బాచుపల్లి లోని ఎర్రకుంటలో వెలసిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ కట్టడాలపై దూకుడుగా ముందుకు వెళుతుండడంతో బాచు పల్లిని ఆనుకుని ఉన్న ఒర్రకుంటలోని అక్రమ విల్లాలపై చర్యలు తీసుకుంటారన్న ఆశలు చిగురిస్తున్నాయి. అయితే అక్రమ నిర్మాణాలపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఎంతటి వారినైనా ఎదుర్కొం టామని.. చెరువుల్లో నిర్మాణాల్లో ఉన్న అక్రమణలను తొలగిస్తామని చెబుతున్న హైడ్రా కమిషనర్ బొల్లారం ఒర్ర కుంటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవా అని స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సంస్థకు సంబంధించిన ప్రమోటర్లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో హైడ్రా తనపని తాను చేసుకుంటూ పారదర్శకంగా వ్యవహరిస్తుందా..? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొంచి అడ్డగోలుగా విర్రవీగుతున్న గ్రేటర్ ఇన్ఫ్రా యాజమాన్యానికి లొంగిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.. ఒర్రుకుంట కబ్జాపై మరిన్ని ఆధారాలతో.. కళ్ళు చెదిరే వాస్తవాలతో మరో కథనం ద్వారా మీముందు రానుంది ” ఆదాబ్ హైదరాబాద్ “.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

వనవర్తి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..

4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు వనపర్తి జిల్లాలోని బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS