Monday, September 8, 2025
spot_img

ఢిల్లీని వెనక్కి నెట్టిన హైదరాబాద్‌

Must Read
  • పెరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడులు
  • గ్రామీణ ప్రాంత ప్రజలూ నగరబాట..

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌లో సెటిల్‌ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగరబాట పడుతున్నారు. నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండంటతో సిటీలో సెటిల్‌ అయ్యేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌ నగర జన సాంద్రత పెరిగుతోంది. జన సాంద్రత విషయంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీని హైదరాబాద్‌ వెనక్కి నెట్టింది. తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌-2024 నివేదిక గణంకాలు వెల్లడించింది. నగరంలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది జనాభా సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంఖ్య రాజధాని ఢిల్లీలో చదరపు కిలోమీటరుకు 11,313 మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. జన సాంద్రత విషయంలో ఇండియాలో ముంబై తొలి స్థానంలో ఉంది. అక్కడ చదరపు కిలోమీటరుకు 28,508 ఉన్నట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరంగా ఫిలిప్పీన్స్‌లోని మనీలా నిలిచింది. అక్కడ ఒక చదరపు కిలోమీటరులో 43,079 మంది నివసిస్తున్నారు. అయితే వేగవంతమైన పట్టణీకరణ ఓ సవాల్‌ లాంటిదేనని నిపుణులు అంటున్నారు. అది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిందని చెబుతున్నారు. జనాభా పెరుగుదలతో ఓ వైపు హైదరాబాద్‌ నగరం వృద్ధి పథంలోకి వెళ్తున్నా.. అదే సమయంలో అందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించటం ప్రభుత్వానికి శక్తికి మించిన పని అంటున్నారు. పెరగుతున్న జనాభా మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలు, ఇండ్ల నిర్మాణంపై ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఓ వైపు హైదరాబాద్‌ నగరంలో జన సాంద్రత పెరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. 2011 జనాభా లెక్కల డేటా ప్రకారం.. రాష్ట్ర జనాభా 3.5 కోట్లుగా ఉంది. తెలంగాణ మొత్తం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణాన్ని కలిగి ఉంది. చదరపు కిలోమీటరుకు 312 మంది జనాభా సాంద్రతను కలిగి ఉంది. 2031 నాటికి ఇది మరింత తగ్గే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో యువ జనాభా కూడా తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. 2031 నాటికి 39 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారి జనాభా 0.23 శాతం తగ్గే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. అదే సమయంలో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందని.. దీని కారణంగా రాష్ట్రంలో వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This