Friday, September 20, 2024
spot_img

గురువులకు అంకితం గురుపౌర్ణమి

Must Read

జులై 21న గురు పౌర్ణమి సందర్బంగా

  • గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

వేద వ్యాస మహర్షి లేకపోతే మన వాజ్మయం లేదు.వాజ్మయం లేకపోతే సనాతన సంస్కృతి మనకు అందేది కాదు. మానవాళి ముక్తి కోసం జ్ఞానాన్ని అందించిన వ్యాసున్ని నిత్యం స్మరించుకుందాం.
భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం గురువుకి అంకితం చేసిన ముఖ్యమైన రోజును గురుపౌర్ణమి గా జరుపుకుంటారు. గురువు అంటే ఉపాధ్యాయుడు,ఆచార్యుడు.అంటే చీకటి లేదా అజ్ఞానం,ఆ చీకటిని తొలగించే వారని అర్థం.అనగా అజ్ఞానం యొక్క చీకటిని తొలగించే వారు గురువు అని అర్థం.గురుపౌర్ణమి అనేది ఆధ్యాత్మిక గురువులు మరియు ఉపాధ్యాయుల మంచితనాన్ని స్మరించే రోజు.గురువు ఒక బిడ్డకు విద్యను అందించి ప్రకాశ వంతము చేసే వ్యక్తిగా గురువు ప్రాచీన కాలం నుండి గౌరవింప బడ్డాడు.గురువు తోనే పిల్లల జీవితం సంపూర్ణంగా ఉంటుంది.గురుపౌర్ణమి ప్రతి సంవత్సరం ఆషాడ మాసం పూర్ణిమ తిథి రోజున వస్తుంది ఈ సంవత్సరం జూలై 21న గురుపౌర్ణమి రావడం జరిగింది .అదేవిధంగా మహాభారత కావ్యాన్ని రచించిన వేదవ్యాసుని జన్మదినం రోజు కూడా గురుపూర్ణిమ గా భావిస్తారు.ఈ పౌర్ణమి రోజున వేదవ్యాస ముని సత్యవతి,పరాశర దంపతులకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.భారతదేశంలో మహాభారత, ఇతిహాసాల రచయితగా వేదవ్యాస మహర్షి ప్రశంసలందుకున్నారు.అలాగే ప్రాచీన వేదా లైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం అని నాలుగు వేదాలను,నాలుగు గ్రంథాలుగా వర్గీకరించాడు వేదవ్యాసుడు.అదేవిధంగా ఆయనకు నలుగురు శిష్యులు ఉన్నారు.వారు పైలా, వైశంపాయన, జైమిని, మరియు సుమంతు ఈ నలుగురు శిష్యులు వ్యాసముని వారసత్వాన్ని పుచ్చుకొని ప్రాచీన భారతంలో వ్యాసున్ని గౌరవించే విధంగా పూజలు చేశారు.అంతేకాకుండా ఆషాడ పౌర్ణమి రోజున బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజు కూడా ఈ రోజే . బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజున బౌద్ధులు,గౌతమ బుద్ధుని బోధనలను గౌరవించడానికి గురుపూర్ణిమ వేడుకలను బౌద్ధులు కూడా జరుపుకుంటారు.గౌతము గౌతముడు బోధి చెట్టు కింద జ్ఞానోదయమైన ఐదు రోజుల తర్వాత గౌతమ బుద్ధుడు బోధ గయ నుండి ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ కి వెళ్ళాడు.ఆ రోజు పౌర్ణమి రోజు అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు.అందుకే బుద్ధుని అనుచరులు ఆయన ఆరాధించడానికి ఈ రోజును వేడుక లాగా జరుపుకుంటారు.అందుకే గురుపూర్ణిమను,వ్యాస పూర్ణిమగా,బుద్ధ పూర్ణిమ గా పిలుస్తారు.వేదవ్యాసుడు గురు శిష్యుల సంప్రదాయానికి మార్గదర్శకుడు అని చెప్తున్నది. ఇది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం గా ఉద్భవించింది.మానవులు జ్ఞాని అయినా ఆధ్యాత్మిక మరియు విద్య ,గురువులకు అంకితంగా గురుపౌర్ణమి కార్యకలా పాల వేడుకగా అభివర్ణిస్తారు. కానీ నేడు గురు శిష్యుల సంబంధం విలువలతో కూడిన దిగా ఉండడం లేదు.ప్రాచీన కాలంలో గురువుల వద్దకే శిష్యుడు వెళ్లి విద్య విలువిద్యలు ,శాస్త్రాలు, రామాయణ, మహాభారత ,ఇతిహాసాలు అభ్యసించేవారు. నేడు శిష్యుల వద్దకే గురువులు వెళ్లి విద్యా బోధన చేసే రోజులు వచ్చాయి.అందుకే గురుశిష్యుల మధ్య సంబంధాలు తగ్గాయి. గురువుల ను గౌరవించే ,పూజించే సాంప్రదాయం రోజు రోజుకు మారుతున్నది .గురు పౌర్ణమి రోజున షిరిడి సాయి బాబా జన్మదినం గా కూడా సాయి భక్తులు అంగరంగ వైభవంగా ఆలయాల్లో నిర్వహిస్తూ కార్యక్రమాలు కూడా చేస్తారు. జైన మతస్తులు కూడా గురు పూర్ణిమ రోజున ట్రే నోర్ గుహ పూర్ణిమ గా జరుపు కుంటారు. అందుకే గురుపూర్ణిమ హిందూ, బౌద్ధ, జై న మతాల సాంప్రదాయంగా జరుపు కునే వేడుకగా చెప్ప వచ్చును.గురువులను గౌరవించుదాం.గురు భక్తిని చాటుకుందాం.

కామిడి సతీశ్ రెడ్డి,ములుగు పల్లి ఉన్నత పాఠశాల,జయశంకర్ భూపాలపల్లి జిల్లా.9848445134.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This