ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు.. నారా రోహిత్ లేఖకు స్పందిస్తూ.. మా మనసులోని మాట చెప్పారన్నా అంటూ విక్టరీ సింబల్‌తో స్పందిస్తున్నారు
