ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తమ నాయకుల పైనే దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ పై దాడి జరిగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.దాడిని నిలువరించడంలో ప్రభుత్వం,పోలీస్ వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు.వెంటనే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.