రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన చాల మంది రక్తదానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.రక్తదానం చేయడం వల్ల బలహీనతకు గురవుతామని,ఇంకా అనేక రకమైన సమస్యలు వస్తాయని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇవ్వన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు.
రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.రక్తంలోని ఐరన్ స్థాయి అదుపులో లేకపోవడం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశముందని వైద్యులు తెలుపుతున్నారు.దింతో రక్తదానం చేయడం వల్ల ఐరన్ స్థాయి అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా రక్తదానం చేయడం వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి